"బ్రాహ్మణులు" అనే మాట "బ్రహ్మన్" అనే పదం నుంచి వచ్చింది. బ్రహ్మన్ అంటే "యజ్ఞం’ అనే అర్థం. యజ్ఞాలు చేసే వారు బ్రాహ్మణులని చెప్పుకోవచ్చు. అలానే "బ్రహ్మ" అంటే వేదం అని, జ్ఞానం అని, వీటి నుంచే బ్రాహ్మణ శబ్దం వచ్చిందని కూడా అంటారు. అంటే వేదాలను చదివి ఆచరించేవాు,  ఆత్మజ్ఞానం తెలిసినవాడు  "బ్రాహ్మణుడు" అని అర్థం.

బ్రాహ్మణ స్త్రీ యందు, బ్రాహ్మణ పురుషుడి వలన జన్మించి, తదుపరి, జాతి, కులం, వృత్తి, జ్ఞానాలవల్ల బ్రాహ్మణుడిగా పిలువబడతాడు. తాను నిరంతరం చదువుకుంటూ వుండడం, శిష్యులకు బోధించడం, యజ్ఞాలు చేయడం, యజమానులతో చేయించడం, దానాలు ఇవ్వడం, తీసుకోవడం బ్రాహ్మణులు చేయాల్సిన పని. ఒకా నొక రోజుల్లో బ్రాహ్మణులకు బ్రహ్మ-క్షత్రియ గుణాలుండేవి.

ఆ తరువాత, వారు తమ క్షత్రియ గుణాలను పూర్తిగా వదిలి, పాలన, మంత్రాంగం, పురహితాల (పౌరోహిత్యం అంటే పుర హితం చూసే వారని అని అర్ధం అని నేడు ఎందరికి తెలుసు?)  వైపు దృష్టి మరల్చారు. బ్రాహ్మణులకు అనాది నుంచీ, సమాజంలోని ఇతరుల నుంచి ఎంతో గౌరవ ప్రపత్తులు లభించేవి. ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామ పరిపాలన, సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ కొరకు పనిచేసే "పంచ ప్రధానుల" లో కనీసం ఒకరిద్దరు బ్రాహ్మణులుండేవారు. అదే నేటి గ్రామ పంచాయతీ వ్యవస్థగా మారింది.

సుమతి శతకం ప్రకారం, ఒక ప్రదేశం గ్రామం అనిపించుకోవాలంటే, దానికి వుండాల్సిన ప్రాధమిక లక్ష్యాలలో “వూళ్లో బ్రాహ్మణుడు” వుండడం కూడా ఒకటి. సమాజాన్ని మార్క్సిస్టు కోణంలో నిశితంగా పరిశీలన చేసిన చరిత్రకారుడు కోశాంబి తన గ్రంధంలో, బ్రాహ్మణులు సమాజానికి చేసిన సేవకు గుర్తింపుగా గొప్ప "యోగ్యతాపత్రం" ఇచ్చారు. ఆర్య, ఆదిమ వాసుల పునః కలయిక వల్ల ఏర్పడిన కులంగా బ్రాహ్మణులను గుర్తించింది ఆర్యసమాజం.

సుమతి శతకం ప్రకారం, ఒక ప్రదేశం గ్రామం అనిపించుకోవాలంటే, దానికి వుండాల్సిన ప్రాధమిక లక్ష్యాలలో “వూళ్లో బ్రాహ్మణుడు” వుండడం కూడా ఒకటి.  

అప్పిచ్చువాడు వైద్యుడు  
ఎప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడున్ 
చొప్పడిన యూర నుండుము 
చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ

నిత్యావసర వస్తువులను నాడు బార్థర్ సిస్టములో - అప్పిచ్చేవాడు అంటే వైశ్యుడు - వైద్యుడు, ఎప్పుడు ప్రవహించే ఏరు, నది లేదా ఉపనది, బ్రాహ్మణుడు నివసించేది “వూరు” అని అర్ధం అంటే నివాస యోగ్యం. ఇవి లేనిచోట ఉండరాదు. దిన్ని బట్టి సమాజంలో అనవరతం వైశ్యుడు, బ్రాహ్మణుల ఉనికి విలువ అనంతం .

నేడు ఆంద్ర రాష్ట్రంలో అగ్రవర్ణాలుగా పిలవబడుతున్న బ్రాహ్మణులనే సామాజిక వర్గం లేదా కులం రాజకీయంగా సామాజికంగా ఆర్ధికంగా పూర్తిగా వెనుకబడి పోతుంది.

హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బ్రాహ్మణుల ప్రధాన కర్తవ్యం సమాజోన్నతికి పాటుపడటం. నిరంతరం జ్ఞానార్జన చేస్తూ, వేదములందు ప్రావీణ్యం కలవారై, సత్యనిరతిని, ధర్మవర్తనను సమాజానికి బోధిస్తూ సమాజ అభ్యున్నతికి పాటుపడాలి.

దైవ విశ్వాసం, భక్తి పెంపొందించి సమాజాన్ని ఉత్తమమార్గంలో నడపడం వలన వారికి సమాజంలో సముచిత గౌరవం లభిస్తుంది, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి పౌరాణిక ఆధ్యాత్మిక సంబంధ విషయాలపై మంచి అవగాహనను కలిగి ఉంటారు.


బ్రాహ్మణులను విప్రులు అంటే సమాజానికి నిరంతర ప్రేరణ కలిగించేవారు, లేదా ద్విజులు - అంటే రెండుసార్లు జన్మించిన జన్మతః వృత్తిపరంగా - అని కూడా పిలుస్తారు. ఆధునిక వాడుకభాషలో అందరూ బ్రాహ్మణులు అయినప్పటికీ, ప్రాంతీయ మత ఆచార వ్యవహారములు, వేద పాఠశాలలు నిర్వహణ పౌరోహిత్యం, వివాహ శుభకార్యాల నిర్వహణ, మరణ సంభందిత స్నాతక కార్యక్రమాల నిర్వహణ, పరిపాలన ప్రభుత్వ కార్యక్రమ విధుల మూలంగా వీరిలో పలు భిన్నవిభిన్న శాఖలు ప్రాంతాల వారీగా ఉపకులాల వారీగా విభజించబడ్డారు.


ఒక వర్గం బ్రాహ్మణులు సంప్రదాయబద్ధంగా ఆలయ పూజాదికాలు నిర్వహిస్తూ “పూజారులు” గా పిలవబడతారు. బ్రాహ్మణులు అందరూ వేద విద్య  నేర్చుకొని అగ్నిహోత్ర విధి నిర్వహించే పూజారులు కారు. నేడు చాలా కొద్ది మంది బ్రాహ్మణులు మాత్రం వేద విద్య నేర్చుకోవడం, సన్యాసదీక్ష తీసుకొని  వేదవిహితంగా నిరాడంబరంగా పురోహితుల విధులు నిర్వర్తించుతున్నారు.


పురాతన భారత సామాజిక నిర్మాణం పతనం కారణంగా, వివిధ వృత్తులు, ఉద్యోగాలకు బ్రాహ్మణులు అవకాశములు వెతుక్కున్నారు. వారి జ్ఞాన బోధననకు గుర్తింపుగా ఉపకార వేతనాలు, బహుమతుల ద్వారా వారికి మద్దతు లభించింది.  అప్పటి నుండి ఇతర ప్రాంతాలకు బ్రాహ్మణుల వలసలు కొనసాగుతున్నాయి..


శత సహస్రాబ్దాల జ్ఞాన సమూపార్జన ఫలితంగా వీరిలో తెలివితేటలకు (ఇంటలెక్టువాలిటీ) కొదువ లేదు. కానీ హిందూ సమాజం అనాదిగా అందించిన జన్మతః వృత్తి బాధ్యత వలన ప్రత్యేక వేషభాషలతో సమాజంలో పౌరోహిత్యం, దేవాలయాల్లో పూజారి బాధ్యతలు నిర్వహించే వారి పట్ల ఆధునిక సమాజం, ప్రత్యేకించి పాశ్చాత్య వేష భాషల కారణంగా నిర్లక్ష్యం వహిస్తుంది.

వారు సమాజంలో దైవచింతనను పెంచాలని, సమాజహితం కోరే "పురోహితులు”గా వుండాలనీ, ఒకనాటి వ్యవస్థ నిర్దేశించింది. సమాజం వారికి అప్పగించిన బాధ్యతను చాలా కాలంపాటు బ్రాహ్మణులు సక్రమంగా నిర్వహించారు కూడా. కాలానుగుణంగా అభివర్ణించి,  ప్రాచీన పవిత్ర గ్రంథాలలో లభ్యమైన వాటిని భద్రపరిచింది వారేనని అపారం అని నాటి సమాజం గుర్తించింది. దాని విలువ అపారమని పేర్కొన్నారు.

సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా, బ్రాహ్మణులు కూడా మార్పులకు లోనుకాక తప్పలేదు. ఒకటి మాత్రం వాస్తవం. బ్రాహ్మణులు కులవ్యవస్థకు కారకులు కాదు. వారు కులవ్యవస్థను పెంచి పోషించిందీ లేదు. సమాజం అవసరాల నేపధ్యంలో అదే సమాజం సృష్టించుకున్నవే ఇవన్నీ.


(బ్రాహ్మణుల గురించి ఇంకొన్ని విషయాలు మున్ముందు)

మరింత సమాచారం తెలుసుకోండి: