
కొన్ని ప్రసార మాధ్యమాల్లో కనిపించే వార్తా 'తెలంగాణా పురం' ఇండియా హెరాల్డ్ పాఠకుల కోసం ఈ కథనం. మనం మన తరగతుల్లో త్రిలింగ దేశం, త్రిలింగ, తెలుంగ అంటూ ఎన్నో పాఠాలు చదువుకున్నాం. “శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం” అనె ఈ మూడు శైవ క్షెత్రాల మద్య నెలకొన్న భూబాగం - కాకతీయుల చేత పాలించబడ్డ ప్రాంతమె - త్రిలింగ దేశం -
తెలుగు మాట్లాడే కాకతీయుల రాజ్యం, తెలుగు + ఆణెం (అంటే దేశం) కాల గమనంలో "తెలంగాణ" అనే పదంగా మారింది. భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి తెలంగాణ. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం.
అయితె ఇప్పుడు తెలంగాణా కు మూలమైన తొలి గ్రామం ఏది? మొదట తెలంగాణా అనే పదం లేదా పేరు వాడిన ప్రాంతం? దీనికి ఆధారంగా చెప్పబడే శాసనం ఏదైనా ఏమైనా ఉన్నాయా? ఈ ప్రశ్నకు ‘అది మన రాష్ట్రం పేరు, ఆ పేరుతో ఊరు - పురం - పట్టణం కూడా ఉన్నాయా అన్నదానికి?’ ప్రశ్నే స్పంధనగా వస్తుంది.
కానీ ఆపేరుతో ఒక ఊరు కూడా ఉండేదని శాసన పూర్వకంగా తెలిసింది. అదీ ఎక్కడో? కాదు, భాగ్యనగర శివార్లలోనే! అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ విస్తరిస్తున్న హైదరాబాద్ పురోగతికి ఇప్పుడు చిరునామాగా కనిపిస్తున్న “తెల్లాపూర్” ఒకప్పటి తొలి తెలంగాణ గ్రామం గా భావించబడ్డ - తెలుంగాణ పురం -
కాలక్రమంలో తెలుంగాణ పురం కాస్తా ‘తెల్లాపూర్’ గా మారిపోయింది. తెలంగాణ అన్న పదం ఉన్నతొలి తెలుగు శాసనం వెలుగు చూసింది ఈ గ్రామంలోనే. ఇది సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలోకి వస్తుంది.
త్రిలింగ దేశం ఆ తర్వాత తిలింగ రాజ్యం కొందరు మహమ్మదీయ రాజులు పలకలేక పలికిన తిలింగ్, తెలింగ్, తెలంగ్ ఇలా అంటూ ఉండేవారు. మరి కొందరు విదేశీయులు. నాటి సికిందరాబాద్ బ్రిటీష్ కంటోన్మెంట్ వాళ్ళు - ట్రిలింగాన్ - అని పిలిచెవారు. వేర్వేరు సామ్రాజ్యాలు, వారి కాలాల్లో ఇలా రకరకాల పేర్లతో సంబోధించ గా రూపాంతరం చెందిన, ఆ ప్రాంతమే ప్రస్తుత తెలంగాణ. మరి మొదటిసారి “తెలంగాణ” అన్న పదాన్ని ఎవరు? ఎప్పుడు? ఎలా? వాడారో తెలిసిపొయింది కదా! ఇప్పుడు దానికి సంబంధించిన శాసనమే మనకు లభించటంతో ఆ విషయం ఆసక్తి గొలుపుతోంది. ఆరు శతాబ్దాల క్రితం వేయించిన ఆ శాసనం ఇరుకు సందులో ఇళ్ల మధ్య బందీ అయిపోయింది. దాని గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియకుండా పోయింది. కొంతమంది చరిత్రకారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు రికార్డు చేసినా, అది కొంత మందికే పరిమితమైంది. దేశంలో 29 వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ పేరు ను తొలిసారి లిఖిత పూర్వకంగా వాడింది ఈ శాసనం లోనే. అంటే ‘తెలంగాణ’ అస్తిత్వానికి తొలి నిదర్శనం అన్నమాట – ఈ ‘తెలుంగాణపురం’ఎక్కడుంది? అన్నదానికి సమాధనం దొరికింది కదా! దాని చరిత్ర ఇలా ఉంది:బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా తన రాజ్యాన్ని విస్తరించే క్రమంలో 1417 లో విజయనగర రాజు రెండో దేవరాయల అధీనంలో ఉన్న “పానగల్లు కోట” మీద దాడికి బయలు దేరాడు. దారిలో కనిపించిన హిందూ సంప్రదాయ కట్టడాలను ధ్వంసం చేయటం ప్రధన కార్యంగా కొనసాగిన విధ్వంసంలొ పలు మందిరాలు నమరూపాలు లేకుండా ధ్వంసమయ్యాయి.
ఆ కాలంలోనే తెల్లాపూర్ కూడా ప్రణాళికా బద్ధంగా ఎదిగిన పట్టణం. తెలుంగాణ పురం - అన్న పేరుతో అభివృద్ధి చెందిన ప్రాంతం. కొందరు విశ్వకర్మలు అంతే కంసలి వాళ్ళు ఈ ప్రాంతంలో మంచి నేర్పరి తనమున్న నైపుణ్యవంతులైన శిల్పులుగా పేరొంది ఉన్నారు. వారు నగల తయారీలోనే కాకుండా, గ్రామ, పుర, నగర నిర్మాణ ప్రణాళికల రూపకల్పన లోనూ నేర్పరులై ఉన్నారు.
అందులో కొండ మీది మల్లోజు, అతని కొడుకులు నాగోజు, అయ్యలోజు, వల్లబోజు తదితరులు ఇక్కడ పెద్ద మామాడి తోటను నిర్వహించేవారు. నీటి కోసం విశాలమైన దిగుడు బావి తవ్వించి “ఏతం” వేసి నీటిని నూతి నుండి తోడేపద్ధతిలో వాడెవారు. ఆ నీటినే తాగునీరుగా సాగునీరుగా వాడేవారు. పానగల్లు కోటపై దాడి కోసం ఫిరోజ్ షా ఇదే మార్గంలో వెళ్లనున్నారని తెలిసి, వారు ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేయకుండా ఉండా లన్న ఉద్దేశంతో ఫిరోజ్ షా భార్యకు బంగారు పూదండల చెక్కి తీర్చి దిద్దిన కంఠాభరణం, అలాగె నగిషీలు చెక్కిన బంగారు గాజులు అద్భుతం గా అందంగా తయారు చేసి బహుమతిగా ఇచ్చారు.
ఈ విషయాలను వివరిస్తూ ప్రత్యేకంగా ఆ మల్లోజు వంశస్తులు “ప్రశస్తి శాసనం” చెక్కి దిగుడు బావిపైన ఏతాం కోసం ఏర్పాటు చేసిన రాతి స్తంభాల మధ్య ఆ అమర్చారు. ఆ శాసనం నేడు తెలంగణ అనె పదం పుట్తినట్లు చెప్పటానికి మూలాధారంగా నిలిచింది. అందులో ఈ ప్రాంతాన్ని “తెలుంగాణ పురం” గానే పేర్కొన్నారు. ఆ శాసనంపై తెలుగులో 24 పంక్తుల వివరాలు చెక్కబడి ఉన్నాయి.
2008 లో ఉమ్మడి రాష్ట్రంగా ఉండగా పురావస్తు శాఖ తరపున నాటి “స్తపతి” లేదా “శిల్పి” ఈమని శివనాగి రెడ్డి ఈ శాసనాన్ని పరిశీలించారు. అప్పటికే బావిని సింహభాగం పూడ్చేశారు. కొన్ని మెట్లు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. పైగా ‘గిరక’ కోసం ఏర్పాటు చేసిన రెండు రాతి శిలలు పడిపోయే పరిస్థితిలో ఉండటంతో ఆయన వాటిని క్రమ పద్ధతిలో పూర్వపు స్థితిలో ఉండేలా తిరిగి ఏర్పాటు చేయించారు.
ఆ శిలల దిగువన కాకతీయ శైలిలో కళాత్మకంగా చెక్కిన భారీ రాతి పీఠం ఉంది. ఆ తర్వాత మొత్తం బావిని స్థానికులు పూడ్చేశారు. ఇప్పుడు దాని చుట్టూ ఇళ్లు వెలవటంతో పూర్తి ఇరుకు సంధు లాంటి స్థలంలో ఆ శాసనం బందించినట్లు బందీగా ఉండిపోయింది. అప్పట్లోనే శివనాగిరెడ్డి, ఆ ప్రాంత నేతలను తీసుకెళ్లి దీన్నిచూపించారు.
‘తెలంగాణ లేదా తెలుంగాణ అన్న పదం లేదా పేరును వాడిన తొలి శాసనానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రాధాన్యం దక్కాలి. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి. ఇంత పెద్ద ఉద్యమంతో ఏర్పడ్డ రాష్ట్రంలో, రాష్ట్రం పేరుకు పునాదిగా తొలిసారి వాడిన శాసనంగా ఋజువు గా దాని విలువ దానికి దక్కి – ఆ వూరు ఆ పేరు ఆ ప్రాంతం అందలం దక్కాల్సి ఎక్కాలి. దాని పర్యాటక ప్రాంతంగా మరిస్తే ఆ గౌరవం దక్కుతుంది అని శివనాగిరెడ్డికే కాదు తెలంగాణా సమాజం అంతా భావిస్తుంది.