అనంత‌పురం జిల్లాలో కీలకమైన  హిందూపురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ రాజ‌కీయాలు మారుతున్నాయా? ఇక్క‌డ మ‌రోసారి న‌వీన్ నిశ్చ‌ల్ హ‌వా కొన‌సాగ‌నుందా? ఆయ‌న దూకుడు పెరిగిందా?  పార్టీ అధిష్టానం కూడా ఆయ‌నను మ‌రోసారి ప్రోత్స‌హించేందుకు ప్ర‌య‌త్నిస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త రెండుసార్లుగా ఇక్క‌డ టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంటోంది. అయితే.. ఇప్పుడు టీడీపీ రాజ‌కీయాల‌లో ఒకింత నిరాశ ఏర్ప‌డింది. గ‌తంంలో పార్టీ అధికారంలో ఉన్న‌ప్పు డు.. అడ‌పా ద‌డ‌పా అయినా.. ఎమ్మెల్యే, హీరో.. నంద‌మూరి బాల‌కృష్ణ‌ నియోజ‌క‌వ‌ర్గంలోకి వ‌చ్చేవారు. ఇక్క‌డివారిని ప‌ల‌క‌రించేవారు.

అదేస‌మ‌యంలో ఇక్క‌డివారు ఫోన్ చేసినా స్పందించే వారు .అయితే.. టీడీపీ ప్ర‌భుత్వం ప‌డిపోయిన త‌ర్వాత‌.. బాల‌య్య ఇక్క‌డ క‌నిపించ‌డం లేదనేటా క్ జోరుగా వినిపిస్తోంది. స‌రే.. ఇది వైసీపీకి క‌లిసి వ‌చ్చింది. వైసీపీ నాయ‌కులు.. దీనిని అడ్వాంటేజ్‌గా చేసుకుని ముందుకు సాగుతున్నారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ పొందిన ఇక్బాల్ ఓట‌మి త‌ర్వాత‌.. ఎమ్మెల్సీ అయ్యారు. దీంతో ఆయ‌న సేఫ్ అయ్యారు.

ఇక‌, గ‌తంలో ఇక్క‌డ చ‌క్రం తిప్పిన న‌వీన్ నిశ్చ‌ల్‌.. కాంగ్రెస్ త‌ర‌ఫున గ‌తంలో పోరాడారు. త‌ర్వాత‌.. ఇండిపెండెంట్‌గా, 2014లో వైసీపీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచారు. అయితే.. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం కేటాయించిన కార్పొరేష‌న్ చైర్మ‌న్ గా ఉన్నారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. విజ‌యం ద‌క్కించుకుని నియోజ‌క‌వ‌ర్గంలో స‌త్తా చాటాల‌ని న‌వీన్ భావిస్తున్నారు. నియోజ కవ‌ర్గంలో ఆయ‌న‌కు ఉన్న ప‌లుకుబ‌డిని.. త‌న‌పై ఉన్న సింప‌తీని రంగ‌రించి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం దిశ‌గా దూసుకుపోయేం దుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇక‌, పార్టీలో చిన్న చిన్న వివాదాలు త‌ప్పితే.. పెద్ద‌గా న‌వీన్‌ను విభేదించే నాయ‌కులు కూడా లేరు. ఈ నేప‌థ్యంలో త‌న‌కు టికెట్ ఇవ్వాల‌నేది ఆయ‌న కోరిక‌గా ఉంది. ఇక‌, అధిష్టానం ప‌రంగా చూస్తే.. నంద‌మూరిని ఢీ కొట్టే కీల‌క నాయ‌కుడు కావాల్సిన అవ‌స‌రం అయితే.. ఉంది. ఈ క్ర‌మంలో ఎంపీ మాధ‌వ్ త‌న స‌తీమ‌ణికి కానీ, కుటుంబంలో ఒక‌రికి కానీ.. టికెట్ ఇప్పించుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. తాను గెలిపించుకుంటానంటూ.. పార్టీలో త‌ర‌చుగా చెబుతున్నారు. ఈ క్ర‌మంలో అధిష్టానం మ‌రి ఎటువైపు మొగ్గు చూపుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: