
అయితే కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందని మరొక సామెత కూడా ఆయనకే వర్తిస్తుంది. ఇప్పుడు అలా ఏం జరిగింది అంటే కోటంరెడ్డి నన్నెవరూ మేనేజ్ చేయలేదు, నాతో ఎవరూ చేయించలేరు, నేను తెలుగు దేశం తరపున పోటీ చేద్దామనుకున్నాను, చంద్రబాబుగారు అవకాశం ఇస్తారని కోరుకున్నాను, ఇవ్వాలని కోరుకుంటున్నాను అనే మాటలు తొందర పడి ఒక కోయిల ముందే కూయడం వల్ల జరిగిందని స్పష్టంగా తెలుస్తుంది.
గతంలో ఆయన "నేను ఇంకా ఎలక్షన్స్ 14 నెలలు ఉండగానే ముందు వస్తున్నాను, పోరాడుతున్నాను. నా ఫోన్లన్ని ట్యాపింగ్ చేయటం వల్ల నా ఆత్మ గౌరవం దెబ్బ తింది" ఇలాంటివన్నీ ఉత్తుత్తి మాటలు. కోటంరెడ్డి రెడ్డి వైసీపీ వాళ్ళు తెలుగు దేశం టికెట్ల కోసం బ్రతిమాలుతున్నారు అని అనడానికి వైసీపీ లో టిక్కెట్ల కోసం కోట్లాడుకుంటున్న వారూ అంతే మంది ఉన్నారు. ఇక తెలుగు దేశం లో సీట్ల విషయంలో అయితే కొన్ని చోట్ల జనసేన రాకపోతే తెలుగుదేశం అన్న లెక్క ఉంది. అలాంటప్పుడు వై.సీ.పి వాళ్ళు ఎగబడి పోయి తెలుగు దేశం వైపు వస్తున్నారనడానికి కుదరదు. ఏదైనా ఎమ్.ఎల్.సీ ఎన్నికల్లో తెలుగు దేశం గెలిస్తే, ఆ మాట అంటే ఒక పద్ధతి ఉంటుంది.