ఒరిస్సాలో బంగారం మైనింగ్ గనులు బయటపడ్డాయి. దీనికి సంబంధించి ఒరిస్సాలోని మైనింగ్ శాఖ మంత్రి అసెంబ్లీలో వివరాలను తెలియజేశారు. డియోగాడ్, మయూర్ గంజ్, అడస్, కియొంజర్, కొపూర్, గజిపూర్, కుసేతల, అడల,సరియొఖన, డిమిరిముండ కరదణ్డ, ప్రాంతాల్లో ఈ బంగారు నిక్షేపాలు ఉన్నట్లు మైనింగ్ మంత్రి ప్రకటించారు. అడస్ జీ 12 లెవల్లో కనిపించే రాగి ముడి ఖనిజం లో 1680 టన్నుల బంగారం ఉందని, 6.6 మిలియన్ టన్నుల రాగి ఉందని చెప్పారు. 6.3 మిలియన్ టన్నుల వెండి ఉందని అన్నారు. 10 మిలియన్ టన్నుల నికెల్ ఉందని అంచనా వేస్తున్నారు.


1980 లో కియొంజర్ జిల్లాలో సర్వే చేశారు.  అప్పట్లో బంగారం ఉందని నిరూపించే టెక్నాలజీ లేదు. తర్వాత కూజాప్యార్, గోపూర్ గ్రామాల్లో సర్వే చేసినా దాని ఫలితం ఇంతవరకు బయట పెట్టలేదు. 2020,21 సంవత్సరం లో కుయోజర్ జిల్లాలో ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం తో  తాజా సర్వే చేసింది. కానీ ఆ సర్వే ఫలితాలను బయట పెట్టలేదు ఇంకా గోప్యంగా ఉంచుతోంది.


ప్రస్తుతం దేశంలో మూడు యాక్టివ్ బంగారు గనులు ఉన్నాయి. కర్ణాటకలోని ఉట్టి, ఊటీ మైన్స్, జార్ఖండ్ లోని హిరబుద్దీన్ మైన్స్ లలో బంగారు గనుల తవ్వకాలు జరుగు తున్నాయి. మన దేశంలో ఏటా 750 టన్నుల బంగారాన్ని వాడుతున్నారు. కానీ దేశంలో బంగారు గనుల నుంచి వచ్చేది మాత్రం కేవలం. 1.6 మిలియన్  టన్నులు మాత్రమే అని తెలుస్తోంది.


కాబట్టి బంగారం ధరలు పెరుగుతున్నాయి.  అత్యంత ప్రీతి పాత్రమైన బంగారం దేశంలో దొరకడం ఆనందించాల్సిన విషయం. కర్ణాటకలోనే అత్యంత ఎక్కువ బంగారు నిక్షేపాలు ఉన్నట్లు నీతి ఆయోగ్ చెప్పింది. అక్కడ దాదాపు 88 శాతం బంగారు నిక్షేపాలు ఉన్నట్లు తెలుస్తోంది. బంగారు నిక్షేపాలు దొరకడం అది ఇండియాలోనే ఉండడంతో కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: