
నిజానికి ఈ యురేనియానికి డిమాండ్ ఎక్కువ కాబట్టి ఎక్కడెక్కడ నుంచో కొనుక్కొని వస్తుంటారు. దానిని పారిశ్రామిక ఉపయోగాల కోసం తవ్వడంలో తప్పులేదు కానీ, దాన్ని తవ్వినప్పుడు, దాన్ని శుద్ధి చేసినప్పుడు విడుదలయ్యే నీటిని భూమిలోకి ఇంక నివ్వకూడదు. దానికోసం పెద్ద చెరువు లాంటి దాన్ని, అది కూడా రెండు మూడు లేయర్ల బెడ్ లాంటి దాన్ని ఏర్పాటు చేసి ఒక్క చుక్క కూడా భూమిలోకి ఇంక నివ్వకుండా దానికోసం ఏర్పాటు చేయాలి. అప్పుడే యురేనియన్ని శుద్ధి చేసినందుకు ప్రయోజనం.
దాని ద్వారా చాలా కాలుష్యం ఏర్పడుతుంది కాబట్టి, దాని చుట్టూ కూడా గ్రీనరీ ని బాగా పెంచాలి. కానీ ఇవన్నీ వదిలేసి జగన్ కి సంబంధించిన బంధు వర్గం వాళ్లు ఆ యురేనియం నీటిని మామూలు చెరువుల్లోకి వదిలేసారట. దానితో ఆ నీరు భూమిలోకి ఇంకిపోయి భూమంతా స్ప్రెడ్ అయ్యి చుట్టుపక్కల ఉన్న పొలాలు నాశనమైపోయి, ప్రజల ఆరోగ్యాలు కూడా దెబ్బతిని ఒకరకంగా వాళ్ళ ప్రాణాలతో చెలగాటమే ఆడుకున్నారు వాళ్లు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దాని మీద ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ అక్కడ అంతా బానే ఉంది అని చెప్పి నివేదిక ఇచ్చింది. దానివల్ల ఆ చుట్టుపక్కల ప్రజలకు గర్భ కోశ వ్యాధులనుండి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలని కొందరు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.