వైఎస్ జగన్ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీని కలవకుండా చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే వారు కలిసి ఉన్నట్లే ఎక్కడికి వెళ్లిన ప్రచారం చేస్తూనే ఉన్నారు. వీరు కలిస్తే ఆంధ్రలో వైసీపీకి దెబ్బ పడుతుందని ప్రజల్లోకి టీడీపీ వ్యతిరేకతను తీసుకెళుతున్నారు. ఇదే సమయంలో జగన్ తన ఓటు బ్యాంకును కాపాడుకోవడంలో తల మునకలయ్యారు.


కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని ప్రకటించిన బీజేపీ చావు దెబ్బతిన్నట్లు, కాంగ్రెస్ గెలిచిందని ఇదే కోవలో ఆంధ్రలో కూడా జగన్ ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ తన ఎన్నికల ప్లాన్ ను సిద్ధం చేసుకున్నట్లు, ఏ కులం ఓట్లు తమకు అనుకూలంగా పడతాయి. ఎవరి ఓట్లు వ్యతిరేకంగా ఉన్నాయి. ఏ వర్గం వారు తమను ఆదరిస్తారు. ఇలా అన్నింటిని బేరీజు వేసుకుంటున్నారు.


జగన్ ఓట్ల విషయంలో పక్కగా ఉన్నట్లు కాపులు తమ పార్టీ కి ఓట్లు వేయకపోతే బీసీల ద్వారా ఓట్లు సాధించవచ్చని ప్లాన్ వేశారు. అందుకే బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. మంత్రి పదవుల్లో, ఇతరత్రా విషయాల్లో బీసీలకు ఎక్కువ ప్రయార్టీ ఇచ్చి ఒకప్పుడు బీసీలు అంటే టీడీపీ అనే భావనను పోగొట్టారు. అదే విధంగా క్రైస్తవ, ముస్లిం ఓట్లు కూడా వైసీపీకే అనుకూలంగా ఉన్నట్లు జగన్ భావిస్తున్నారు.


దాదాపు కోటిన్నర ఓట్లు మైనార్టీలవి ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఎస్సీ, ఎస్టీ ఓట్లు కూడా కలిపి దాదాపు 2 కోట్ల వరకు ఉంటాయి. ఇందులో దాదాపు వైసీపీకి 90 శాతం ఓట్లు వస్తాయని అనుకుంటున్నారు. రెడ్డి సామాజిక వర్గంలో 60 శాతం ఓట్లు, అలాగే కాపు సామాజిక వర్గంలో 20 శాతం ఓట్లు కూడా తమకే వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ లెక్కలన్నీ నిజమైతే జగన్ గెలుపు నల్లేరు పై నడకే.. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం వేరేలా ఉందని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: