రాజకీయంలో ఎన్టీ రామారావు గాని, జగన్ గాని, పవన్ కళ్యాణ్ గాని వీళ్ళందరికీ మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. అయితే మొదట నుంచి చంద్రబాబు నాయుడుకి క్లాస్ ఫాలోయింగ్ ఎక్కువ అని అంటుంటారు. ఇప్పుడిప్పుడే నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర మొదలు పెట్టిన తర్వాత లోకేష్ కు వచ్చిన మాస్ ఫాలోయింగ్ చంద్రబాబు నాయుడుకి కూడా కనెక్ట్ అవుతుందని తెలుస్తుంది.
అసలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చింది తెలుగుదేశం పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో కలవడానికి ముందుకు రావడం ఒక గొప్ప విచిత్రం. అలాగే 2009లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీని ఒక మతతత్వ పార్టీ, దానితో ఎప్పుడు కలవం అనడం జరిగిందట. అయినా కూడా భారతీయ జనతా పార్టీ 2014 వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ వైపుకి మొగ్గు చూపి పొత్తు కట్టడం చంద్రబాబు నాయుడుకు ఉన్న కరిష్మాటిక్ ఫాలోయింగ్ కి నిదర్శనం.
ఆ తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అసలు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపని వేళలో మళ్లీ అమిత్ షా చంద్రబాబునాయుడుని పిలిచి మరీ మాట్లాడడం ఇదంతా చంద్రబాబు నాయుడుకి మాత్రమే ఉన్న ప్రత్యేకత. అలాగే 2018 సమయంలో తెలుగుదేశం పార్టీని తీవ్రంగా విభేదించిన పవన్ కళ్యాణ్, 2019 సమయం లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు తో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి