
పార్టీల పరంగా చూస్తే టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీలకు మహిళా నాయకురాళ్లు ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లను ప్రధాని మోదీ నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో తీసుకువచ్చారు. ఇది పార్లమెంట్ లో ఆమోదం పొందింది. ఈ బిల్లు ఇప్పుడు అమలు చేస్తే 2024 తర్వాత అమల్లోకి వస్తుంది.
మోదీ మహిళా రిజర్వేషన్లు ఇచ్చారు కాబట్టి వేరే పార్టీల స్త్రీలు బీజేపీకి ఓటేస్తారా.. అంటే వేచి చూడాల్సిందే. టీడీపీ వాళ్లు ఏమనుకుంటారు ఎన్టీఆర్ సీఎం గా ఉన్నప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు పెట్టారు. దీనిని అనుసరించే ప్రధాని మోదీ ఈ బిల్లు తీసుకువచ్చారు కాబట్టి చంద్రబాబుకు ఓటేస్తే సరిపోతోంది అనుకుంటారా..
వైసీపీ నేతలు బీజేపీతో తమ పార్టీ స్నేహ బంధంగా ఉంటుంది కాబట్టి వైసీపీకి ఓటేస్తే సరిపోతుంది అనుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ విషయాని కొస్తే ఈ బిల్లును అప్పట్లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే తీసుకువద్దాం అనుకున్నారు. ఈ బిల్లు గతంలో సోనియా గాంధీ యూపీఏ ఛైర్ పర్సన్ గా ఉన్నప్పుడే రాజ్యసభలో ఆమోదం పొందింది. కాబట్టి ఈ బిల్లుపై ముందస్తు ఆలోచన మా పార్టీదే అని ఆలోచించి ఎవరి ఓట్లు ఆ పార్టీకి వెళ్తే సామాన్య తటస్థ ఓటర్లే కీలకం అవుతారు. కానీ వీరికి ఈ బిల్లుపై అవగాహన లేకపోతే ఈ ఓట్లన్నీ ప్రధాని మోదీ తన వైపు మలచుకుంటారా అంటే 2024 ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.