మొన్నటి వరకు ఇండియాలో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయని జమిలి ఎన్నికల వైపు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ఆరోపణలు వచ్చాయి. అయితే అదేమీ ఉండదని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తేలిపోయింది. ముఖ్యంగా మహిళా బిల్లు ప్రవేశపెట్టడం కోసమేనని తేలడంతో అన్ని పార్టీలు తప్పకుండా మద్దతు తెలపక తప్పని పరిస్థితి వచ్చింది.


రాబోయే జనవరిలోనే అయోధ్య రామమందిరం ఓపెనింగ్ ఉండటం, అదే నెలలో జనవరి 26న రిపబ్లిక్ డే ఉండడంతో ప్రధాని నరేంద్ర మోదీ ముందస్తు ఎన్నికలకు వెళ్లరని నిర్దారణ అయిపోయింది. అయితే రిపబ్లిక్ డేకు ఈసారి ముఖ్య అతిథులుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని కిషిడ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అల్బనీస్, భారత్ ప్రధాని మోదీ కలిసి పాల్గొన్నారు. అయితే ట్రంపు హయాంలో ఈ నాలుగు దేశాలు కలిసి క్వాడ్ అనే పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి.


దీనిపై అప్పట్లో చైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఇది ఒక రకమైన నాటో కూటమి అని విమర్శలు చేసింది. అయితే ఆర్థికంగా, ఆయుధంగా సాయం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే జో బైడెన్ వచ్చాక అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా కలిపి అకూస్ గా ఏర్పడ్డాయి జో బైడెన్ కావాలనే ఇండియాకు పక్కకు పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే జో బైడెన్ తర్వాత పునరాలోచించుకుని భారత్ వైపు మొగ్గు చూపారు. మళ్లీ క్వాడ్ వైపు చూపు సారించారు.


అకూస్ కారణంగా ప్రాన్స్ నుంచి ఆయుధాలు ఆస్ట్రేలియా కొనుగోలు చేయకుండా బ్రిటన్, అమెరికా నుంచి ఆస్ట్రేలియా ఆయుధాలు కొనుగోలు చేయడంతో ఫ్రాన్స్ అమెరికాపై గుస్స అయింది. తమకు వస్తున్న గిరాకీని దెబ్బతీయడం తమ ఆర్థిక వనరులను దెబ్బ కొడుతున్నారని అమెరికా పై మండిపడింది. జో బైడెన్ మళ్లీ అమెరికా నుంచి భారత్ వస్తారా రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొంటారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: