జన విస్ఫోటనంతో ప్రపంచమంతా అల్లాడుతోంది. గతేడాది ఈ సమయానికి ప్రపంచ జనాభా 800 కోట్లు దాటేసింది. అదే ఊపులో మరో 30 నుచి 50 ఏళ్ల లోపు ఏకంగా వెయ్యి కోట్లకు చేరుతుందని అంచనా. మరి ఆ తర్వాత అలా పెరుగుతూనే ఉంటుందా..అయితే పెరగకపోగా బాగా తగ్గుముఖం పడుతుంట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. నిజమే అది ఎంతలా అంటే ఓ 300 ఏళ్ల తర్వాత ప్రపంచ జనాభా మొత్తం కలిపి 200 కోట్లకు పరిమితం అవుతుందని తాజా ఓ అధ్యయనం వెల్లడించింది.

ఇంక గట్టిగా మాట్లాడితే అంతకన్నా కూడా తగ్గే అవకాశం కూడా ఉందని చెబుతోంది. కారణమేంటో తెలుసా.. ప్రాకృతిక విపత్తు అనుకుంటున్నారా కానే కాదు. ప్రపంచ వ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు శర వేగంగా తగ్గి పోతుండటమే. ఈ జాబితాలోని దేశాల్లో భారత్ కూడా ముందు వరుసలో ఉండటం విశేషం. గత 200 ఏళ్లుగా ప్రపంచ జనాభా పెరగుతూ వచ్చింది. ముఖ్యంగా 1950లో 250 కోట్లకు అటుఇటుగా ఉన్న జనాభా ఈ 70 ఏళ్లలో మూడింతలైందని ఐక్యరాజ్య సమితి అంచానా.


మరీ మున్నుందు జనాభా పెరుగుదల ఎలా ఉంటుందన్న ఆసక్తికర అంశంపై యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ కు చెందిన ప్రఖ్యాత ఆర్థిక వేత్త డీన్ స్పియర్ లోతైన అధ్యయనం చేశారు. ఇందులో జనాభా ఊహకందని రీతిలో తగ్గుతుందని తేల్చారు. 2080 నుంచి ఈ ధోరణి మొదలవుతుంది. క్రమంగా ఊపందుకుని అలా మరో 300 ఏళ్లలోపు ప్రపంచ జనాభా 300కోట్లకు పరిమితం అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పత్తి రేటులో నమోదవుతున్న తగ్గుదల ఆధారంగా స్పియర్స్ ఈ నిర్ధారణకు వచ్చారు.


పలు దేశాలో జనాభా పెరుగుదల రేటు తగ్గుముఖమే ఇందుకు రుజువని ఆయన చెబుతున్నారు. ఐరాస అంచనాలు కూడా స్పిర్స్ వాదనను బలపరిచేలా ఉన్నాయి. 2010లో 700 కోట్లున్న జనాభా.. 2022లో 800 కోట్లకు చేరింది. అంటే వంద కోట్ల జనాభా పెరగాడానికి 12 ఏళ్లు పట్టింది. ఆ సంఖ్య 900 కోట్లకు చేరాలంటే 15 ఏళ్లు పడుతుందని ఐరాస పేర్కొంది. అంటే 100 కోట్లు పెరిగేందుకు మూడేళ్ల అదనపు సమయం పడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: