
వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గం కన్నెత్తి కూడా చూడటం లేదు. గతంలో నియోజకవర్గాల పై పట్టు సాధించిన
నేతలు పదవులు పోయాక పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక అసలు కేడర్ను పట్టించుకోవడమే మానేశారు. వైసీపీ నేతలు కొంతమంది దీనిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తిలో ఎంపీ గురుమూర్తి వైసీపీ కేడర్‌కు అన్నీ తానే వ్యవహరించడం పార్టీలో కొత్త చర్చకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఓటమి పాలయ్యాక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. జగన్కు అత్యంత సన్నిహిత నేత ఆయన మధుసూదన్ కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటారని అనుకుంటే ఆయన మాత్రం స్థానికంగా అందుబాటులో ఉండటం లేదు. దీంతో కేడర్ అంతా ఎంపీ గురుమూర్తి వైపు పరుగులు పెట్టడం ఆసక్తికరంగా మారింది.
నియోజకవర్గంలో వైసీపీకి గురుమూర్తి తనకు కంట్లో నలుసులా మారుతున్నారని బియ్యపు మధుసూదన్ శ్రీకాళహస్తికి దూరంగా ఉంటున్నారా ? లేక తన ప్రమేయం లేకుండా కేడర్ ను గురుమూర్తి వైపు తిప్పుకోవడం నచ్చక నియోజకవర్గానికి సెలవు ప్రకటించారా ? లేదా రాజకీయాలపై ఆసక్తి తగ్గిందా అన్న చర్చ వైసీపీలో జోరుగా నడుస్తోంది. అయితే ప్రస్తుతం పాలిటిక్స్ పై మధుసూదన్ అనాసక్తిగా ఉన్నారని వైసీపీ లో వర్గం ప్రచారం చేస్తుంది. ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికలలో గురుమూర్తిని నిలిపి ఆలోచనతో వైసిపి అధిష్టానం వందన ప్రచారం కూడా జరుగుతుంది. అందుకే శ్రీకాళహస్తిలో గురుమూర్తి జోక్యం పట్ల జగన్ సైలెంట్ గా ఉన్నారని టాక్ నడుస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు