
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల రెడ్డి అటు తెలంగాణ రాజకీయాలలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఇద్దరు తమ కుటుంబ సభ్యులను నమ్మి రాజకీయంగా నిండా మునిగిపోయారు అన్న చర్చలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో వినిపిస్తున్నాయి. షర్మిల విషయానికి వస్తే రాజశేఖర్ రెడ్డి ఉన్నంతకాలం ఆమె రాజకీయంగా తెరమీదకు రాలేదు. ఆ తర్వాత తన అన్న వైసీపీ పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ తరఫున చాలా యాక్టివ్ గా పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘంగా పాదయాత్ర చేయడంతో పాటు 2014 - 2019 ఎన్నికలలో వైసీపీ గెలుపు కోసం తన తల్లి వై ఎస్ విజయలక్ష్మితో కలిసి ప్రచారం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక అన్నతో విభేదాలు మొదలయ్యాయి. చివరకు ఏం జరిగిందో ? కానీ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేశారు. చివరకు ఎన్నికలకు ముందు ఆమె పాలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కూడా సీటు ఇవ్వలేదు. తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఆమె ఏపీ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉంటూనే మొన్న ఎన్నికలలో కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. రాజకీయంగా సొంత అన్నతో విభేదించి ఎటూ కాకుండా పోయిన పరిస్థితి. అటు కవిత విషయానికి వస్తే తెలంగాణ ఉద్యమంలో ఆమె ఎంతో కష్టపడ్డారు. నిజామాబాద్ ఎంపీగా గెలిచిన కవిత పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎంపీగా ఓడిపోయారు. అక్కడ నుంచి రాజకీయంగా ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. మొన్న పార్టీ ఎన్నికలలో ఓటమి చెందటం ..ఆ వెంటనే లిక్కర్ స్కాంలో ఆమె అరెస్టు కావడంతో పాటు ఢిల్లీలో తిహార్ జైలులో ఉండాల్సి రావడంతో కవిత ప్రాభవం తగ్గుతూ వస్తోంది. ఇక రేపటి రోజున మళ్లీ పార్టీ అధికారంలోకి వస్తే తన నాన్న సీఎం.. అన్న మంత్రి అవుతారని.. ఆ తర్వాత తన అన్న సీఎం అయితే తన పొలిటికల్ ఫ్యూచర్ ఏంటన్న ఆందోళనతోనే ఆమె తాజాగా లేఖాస్త్రం సంధించారని తెలుస్తోంది. ఏదేమైనా గత పదేళ్ల పాటు వెలుగు వెలిగిన ఈ ఇద్దరు మహిళా నాయకురాళ్లకు ఇప్పుడు పొలిటికల్ కష్టాలు మొదలయ్యాయనే చెప్పాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు