తెలంగాణ మంత్రివర్గం బుధవారం రాత్రి సమావేశంలో దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చట్టానికి ఆమోద ముద్ర వేసింది. గిగ్ వర్కర్లు ప్లాట్‌ఫాం ఆధారిత కార్మికుల సంక్షేమం భద్రత కోసం తెలంగాణ ప్లాట్‌ఫాం బేస్డ్ గిగ్ వర్కర్స్ రిజిస్ట్రేషన్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ యాక్ట్ 2025 బిల్లు ఆమోదం పొందింది. రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల మంది ఈ రంగంలో పనిచేస్తున్న నేపథ్యంలో ఈ చొరవ భారీ స్థాయిలో ఉపశమనం కలిగించనుంది.

ఫుడ్ డెలివరీ బాయ్స్ ఈ కామర్స్ లాజిస్టిక్స్ డ్రైవర్లు ఇంటి పని చేసే వందల వేల మంది కార్మికులు రోజుకు పది నుంచి పన్నెండు గంటలు శ్రమిస్తున్నారు. వీరికి సెలవులు లేవు బీమా లేదు ఉద్యోగ భద్రత లేదు చెల్లింపుల్లో స్పష్టత లేదు. ఈ లోటును గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలోనే ప్రత్యేక చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకున్నారు.2024 డిసెంబరు 23న గిగ్ వర్కర్లతో రేవంత్ రెడ్డి నేరుగా సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు.

పలుమార్లు సంప్రదింపులు జరిపారు. ముసాయిదా బిల్లును ప్రజాభిప్రాయం కోసం వెబ్‌సైట్‌లో ఉంచారు. దాదాపు అరవై నాలుగు సూచనలు వచ్చాయి. అన్నీ పరిశీలించి మరింత బలోపేతం చేసిన బిల్లును ఇప్పుడు కేబినెట్ ఆమోదించింది.ఈ చట్టం అమల్లోకి వస్తే గిగ్ వర్కర్లకు చట్టబద్ధ గుర్తింపు సామాజిక భద్రత బీమా ఫిర్యాదుల పరిష్కార వేదిక లభిస్తాయి. ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు కానుంది. అన్ని గిగ్ వర్కర్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రాజస్థాన్ కర్ణాటక తమిళనాడు జార్ఖండ్ రాష్ట్రాలు కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ తెలంగాణ బిల్లు దేశంలోనే అత్యంత సమగ్రమైనదిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: