దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారానే స్వీకరించాలని సూచించింది. ఉద్యోగుల వినతి అర్హతలను పరిశీలించి మాత్రమే బదిలీలు ఆమోదించాలని పేర్కొంది. ఈ విధానం ఫిర్యాదులు రాకుండా చూడటమే లక్ష్యంగా కనిపిస్తోంది.ప్రస్తుత నవంబర్ నెలాఖరు లోపు మొత్తం బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను జీఎస్‌డబ్ల్యూఎస్ డైరెక్టర్ సిద్ధం చేసి త్వరలో ప్రకటించనున్నారు.
ఈ బదిలీలతో దంపతులు ఒకే ప్రాంతంలో ఉండే అవకాశం కలుగుతుందని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ కీలక ఉత్తర్వులను ప్రభుత్వ కార్యదర్శి కాటమనేని భాస్కర్ జారీ చేశారు. సచివాలయ ఉద్యోగులు ఎన్నేళ్లుగా ఎదురుచూస్తున్న స్పౌజ్ బదిలీల సమస్యకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సత్వరమే పరిష్కారం చూపింది. ఈ చర్య ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంచడమే కాకుండా వారి సేవల్లో మరింత ఉత్సాహం నింపనుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి