విశ్వవిద్యాలయాల అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక రాత పరీక్షను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారికంగా సంసిద్ధతను వ్యక్తం చేసింది. డిసెంబర్ 19న హైదరాబాదులో జరిగిన సమావేశంలో ఏపీ ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సుమితాడావ్రా, ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ శాయి, ఏపీ ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడు పి.నరసింహారావు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. ఇప్పటికే ఉద్యోగ ప్రకటనల్ని జారీ చేసిన ఏపీపీఎస్సీ ఏప్రిల్ చివరో లేదా మే నెలలో ఈ పరీక్షను నిర్వహించేందుకు అవకాశం ఉందని కార్యదర్