గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులకు శుభవార్త. టెన్త్, ఇంటర్, డిగ్రీ ఏం చదువుకున్నా సరే.. మీకు మేం ట్రైనింగ్ ఇస్తాం.. ఆ తర్వాత మీరు జాబ్ కొట్టేసుకోండి. అంటూ అండగా నిలుస్తోంది టెక్ మహీంద్రా ఫౌండేషన్. టెక్ మహీంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నట్లు హెచ్ సీ హెడబ్ల్యూ సంస్థ ప్రతినిధి శ్రీధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


18- 27 ఏళ్ల మధ్య వయసు కల్గి ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులు / అనుత్తీర్ణులకు కంప్యూటర్ బేసిక్స్, ఎంఎస్ ఆఫీస్ 2010, స్పోకెన్ ఇంగ్లిష్, ఇంటర్నెట్ కాన్సెప్ట్, ఇంగ్లిష్ టైపింగ్, కమ్యూనికేటివ్, ఇంటర్వ్యూ స్కిల్స్ లో శిక్షణ ఇస్తారు. బీకాం ఉత్తీర్ణులైన వారికి ట్యాలీఈఆర్ 9, బేసిక్ అక్కౌంట్స్, జీఎస్టీ, అడ్వాన్స్ ఎంఎస్ ఎక్సెల్, కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ తదితరకోర్సుల్లో శిక్షణ ఉంటుంది.


ఇంట్రస్ట్ ఉన్నావారు 76749 85461, 70935 52020 ఫోన్ నంబర్ల ద్వారా నవంబరు 14లోపు పేర్లను నమోదు చేసు కోవాలని ప్రకటనలో సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: