
ఈ స్కాలర్ షిప్ కి కావాల్సిన అర్హతలు చూసుకున్నట్లయితే....10వ తరగతి , ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉంటే చాలు. ఎల్ఐసీ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవచ్చు. సాంకేతిక, వృత్తివిద్యా కోర్సుల్లో చేరిన వారికీ ఈ సాయం అందుతుంది.2019-20 విద్యాసంవత్సరంలో కనీసం 60% మార్కులతో పదోతరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన కాలేజీలు లేదా ఐటీఐ సంబంధిత కోర్సులు చదువుతూ ఉండాలి.ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు మెడిసిన్, ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్ కోర్సులు, డిప్లొమా లేక తత్సమాన ఉన్నత విద్య చదువుతూ ఉండాలి.
కుటుంబ వార్షిక ఆదాయం రూ. లక్ష మించకూడదు.మెడికల్, ఇంజినీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు 55 శాతం మార్కులను, సాధారణ డిగ్రీ కోర్సుల్లో చేరిన వారు 50 శాతం మార్కులను పొందితేనే మరుసటి సంవత్సరానికి స్కాలర్ షిప్ కొనసాగుతుంది.ప్రతిరోజూ హాజరు శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.ఇది డిసెంబర్ 31తేదీ లోగా https://www.licindia.in/ అనే ఆన్లైన్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి...