మజ్జిగ శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని ఎక్కువగా ఎండాకాలంలో తయారు చేసుకుని తాగుతూ ఉంటారు. ఎండలో తిరిగివచ్చినప్పుడు బటర్ మిల్క్ ను తాగడం వల్ల ఎండ నుంచి మన బాడీ కోల్పోయిన ఎలక్రోలైట్స్ ను తిరిగి పొందవచ్చు. మనం చాలా రకాల రుచుల్లో ఈ బటర్ మిల్క్ ను తయారు చేస్తూ ఉంటాం.అయితే అందులో జింజర్ లెమన్ బటర్ మిల్క్ కూడా ఒకటి. దీనిని కేవలం మనం 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఈ మజ్జిగ చల్ల చల్లగా చాలా రుచిగా ఉంటుంది. ఇంకా అంతేగాక మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈ జింజర్ లెమన్ బటర్ మిల్క్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.

జింజర్ లెమన్ బటర్ మిల్క్ తయారీకి కావల్సిన పదార్థాలు ఏంటంటే..పెరుగు – అర లీటర్, అల్లం తరుగు – ఒక టేబుల్ స్పూన్ ఇంకా నిమ్మకాయలు – 2, ఉప్పు – తగినంత వేసుకోవాలి. తరువాత తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ తీసుకోవాలి.


జింజర్ లెమన్ బటర్ మిల్క్ తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా మీరు ఒక జార్ లో పెరుగు, అల్లం తరుగు వేసి మిక్సీ బాగా పట్టుకోవాలి.ఆ తరువాత ఈ పెరుగును గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక లీటర్ చల్లటి నీటిని , తరిగిన కరివేపాకు, నిమ్మరసం ఇంకా అలాగే ఉప్పు వేసి బాగా కలపాలి. ఇక ఇలా చేయడం వల్ల జింజర్ లెమన్ బటర్ మిల్క్ అనేది తయారవుతుంది. తరువాత దీనిని చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.


ఇంకా అలాగే ఈ బటర్ మిల్క్ ను తాగడం వల్ల మనం రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. ఈ బటర్ మిల్క్ ను తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా చాలా సులభంగా తగ్గు ముఖం పడతాయి. ఎండా కాలంలో ఇలా బటర్ మిల్క్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మన శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: