వంటకాలలో వేసే సుగంధ ద్రవ్యాలు చాలామంది ఎంతో ఎంపికగా వేస్తారు. అందరికి అన్ని సుగంధ ద్రవ్యాలు సరిపడవు లేదా ఇష్టపడరు. కొంతమంది ఈ సుగంధ ద్రవ్యాలు లేలదా మసాలాలు దట్టించిన ఆహారాన్ని తినలేరు లేదా తినటానికి భయపడతారు. ఈ సుగంధ ద్రవ్యాలలో చాలా వరకు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో కొన్ని శరీరంలోని మలినాలను విసర్జిస్తాయి. మరి ఏ రకమైన సుగంధ ద్రవ్యాలు మన శరీర లోపలి భాగాలను శుభ్రం చేస్తాయో పరిశీలించండి. నల్లని మిరియాలు - వీటికి యాంటీ సెప్టిక్ గుణం వుంది. శరీరంలోని విష పదార్ధాలను తొలగిస్తాయి.వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణవ్యవస్ధను కాపాడతాయి. వ్యాధులు రాకుండా చేస్తాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది. డయోరియా వంటి వ్యాధులు నయమవుతాయి.  ఫుడ్ పాయిజన్ జరిగితే మిరియం వాడండి. పొట్ట వ్యాధులకు ఇంటి చిట్కా. వెల్లుల్లి - గుండె జబ్బుల రోగులకు మంచి పోషక సుగంధ ద్రవ్యం. వాసన వదిలేయండి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చాలాబాగా పనిచేస్తాయి.  ఈ వెల్లుల్లి కేన్సర్, ఇతర వ్యాధులు రాకుండా చేస్తుంది. పసుపు - సాధారణంగా ఏ వంటకం చేసినా పసుపు వేస్తారు. వంటకం పసుపు రంగులో ఆకర్షణీయంగా కనపడుతుంది.  పసుపు చర్మ కాంతిని మెరుగు చేస్తుంది. శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. కడుపులో మంట తగ్గించి జీర్ణక్రియ మెరుగుచేస్తుంది. వైరల్, ఫంగల్ వ్యాధులనుండి కాపాడుతుంది. అల్లం - అల్లపు రసం జీర్ణక్రియకు ఒక టానిక్. శరీర లోపలిభాగాలను బాగా శుభ్రం చేస్తుంది. మంటను తగ్గిస్తుంది. యాంటాసిడ్ మరియు విరేచనాన్ని కలిగించే పదార్ధాలున్నాయి. అజీర్ణం తగ్గించాలంటే, చిన్న అల్లం ముక్క తింటే చాలు. పొట్టవ్యాధులు తగ్గిస్తుంది. తలనొప్పి తగ్గాలంటే, మీరు తాగే టీ లో కొద్దిపాటి అల్లం వేస్తే చాలు మంచి రిలీఫ్ వస్తుంది. జలుబు, దగ్గు వంటివి తగ్గాలంటే, వెల్లుల్లి తోకలిపి తింటే సత్వర ఫలితాలుంటాయి. దాల్చిన చెక్క - మీరు తాగే టీలో లేదా తినే కూరల్లో దాల్చిన చెక్క వేస్తే, మంచి రుచి వస్తుంది. జీర్ణక్రియను బలపరుస్తుంది. దాల్చిన చెక్క పొడితో రక్తంలోని షుగర్ స్ధాయిలను కూడా నియంత్రించవచ్చు. ఎర్ర మిర్చి లేదా కారం - ఇది తింటే మంట. ఎంతో వేడి చేస్తుంది. మంట తగ్గాలంటే నీరు తాగటమే మార్గం. శరీరంలోని మలినాలను తేలికగా విసర్జిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: