లవంగాలు మన వంటింట్లో ఉండే ముఖ్యమైన మసాలా దినుసుల్లో ప్రధానమైనవి. నాన్‌వెజ్ వంటలు వండినప్పుడు ఎక్కువగా లవంగాలు వేస్తారు. దీంతో ఆయా వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి.  సుగంధద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. విచ్చీవిచ్చని పూమొగ్గలే లవంగాలు. అందుకే మనం వీటిని ముద్దుగా లవంగమొగ్గలనీ పిలుస్తుంటాము. ప్రస్తుతం వీటిని బాంగ్లాదేశ్, బ్రెజిల్‌, ఇండియా, వెస్టిండీస్‌, మారిషస్‌, జాంజిబార్‌, శ్రీలంక, పాకిస్తాన్, పెంబా దేశాల్లోనూ పండిస్తున్నారు.


భారత్‌, చైనాల్లో రెండు వేల సంవత్సరాలనుంచీ దీన్ని వంటల్లో వాడుతున్నారు. మాంసాహార వంటలే కాదు, మసాలా ఘాటు తగలాలంటే శాకాహార వంటల్లోనూ లవంగమొగ్గ పడాల్సిందే. లేకుంటే కిక్కే రాదంటారు మసాలా ప్రియులు. వీటి వ‌ల్ల ఎన్నో ఉప‌యోగాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేయండి..


- లవంగాలు వ్యాధి నిరోధకశక్తిని పెంపొందిస్తాయి. ఇన్‌ఫెక్షన్లను దూరంగా ఉంచుతాయి. కండరాలూ, కీళ్లనొప్పుల్ని తగ్గిస్తాయి.


- లవంగాల్లో ఉండే యాంటీవైరల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సాధారణంగా వచ్చే జలుబు దగ్గును నివారిస్తుంది. లవంగాలు ఉడికించిన నీటిని నోట్లో పోసుకుని గార్గిలింగ్ చేయడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.


- లవంగాలను యాంటీ సెప్టిక్‌గా, నోటి సమస్యల పరిష్కారానికి, దుర్వాసనను అరికట్టడానికి విరివిగా ఉపయోగిస్తారు.


- లవంగం తినడం వల్ల నోట్లో లాలాజల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణం కావడానికి తోడ్పడుతుంది. కాబట్టి భోజనం ముగిశాక లవంగం నమలితే ప్రయోజనం ఉంటుంది.


- కాలేయ సంబంధిత సమస్యలనూ అదుపులోకి తీసుకొస్తాయి. కాలేయంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో లవంగాల్లోని పోషకాలు కీలకంగా వ్యవహరిస్తాయి.


- తలనొప్పిగా ఉన్నప్పుడు గ్లాసు పాలలో కొద్దిగా లవంగాల పొడీ, రాతి ఉప్పూ వేసి తాగాలి. దీనివల్ల కాసేపటికి తలనొప్పి తగ్గి ఉపశమనం కలుగుతుంది.


- లవంగాలు తెల్ల రక్త కణాలను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అలాగే జీవిత కాలాన్ని పెంపొందించే గుణాలు ఇందులో అధికంగా ఉన్నాయి.


- ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం లభించడానికి లవంగం నమలడం ఉపకరిస్తుంది. కడుపులో గ్యాస్ ఏర్పడకుండా ఇది చూస్తుంది. 


- నోట్లో లవంగం ముక్క ఉంచుకొని మెల్లగా నమలడం వల్ల.. కడుపులో యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: