ప్రస్తుత రోజులలో ఎక్కవుగా చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో తెల్ల జుట్టు. ప్రస్తుతం ఈ సమస్య ఎలా ఉంది అంటే చిన్నపిల్లలు నుంచి యవ్వన వయస్సులోకి వస్తున్న కుర్ర కారులకు  ఇబ్బేది పీతేవాటిలో మొదటగా చెప్పుకొనేది ఈ తెల్ల జుట్టు సమస్యే. చాలా మందికి వయస్సు తక్కువ ఉన్నా తెల్లజుట్టు వచ్చేస్తుంటుంది. తెల్లజుట్టు నల్లగా వచ్చేందుకు కొందరు కొన్ని కెమెకిల్స్ వేసుకోవడం లాంటివి చాలా మంది చేస్తుంటారు. అయితే వాటిని వాడటం వల్ల అనారోగ్య సమస్యలు, ప్రమాదకరమైన జబ్బులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 


అయితే తెల్లజుట్టు తిరిగి నల్లవిగా కావడానికి ఎటువంటి చర్యలు ఉపయోగపడవంటున్నారు వైద్య శ్యాస్త్ర నిపుణులు. అయితే ఎక్కువ తెల్ల వెంట్రుకలు రాకుండా అయితే జాగ్రత పడవచ్చుఅంటున్నారు వీరు.


ఉసిరి, హెన్నా పొడులు ఇందుకు ఉపకరిస్తాయని చెబుతున్నారు వీరు. రెండు కప్పుల నీళ్లలో గుప్పెడు ఎండు ఉసిరి ముక్కలు నానబెట్టి మరుసటి రోజు నీటిని వడబోయాలి. ఈ ముక్కల్లో హెన్నాపొడి, నిమ్మరసం, కాఫీ పొడి నాలుగేసి స్పూన్లు చొప్పున వేసి గ్రైండ్ చేయాలి. అలాగే రెండు గుడ్లు, రెండు టీస్పూన్లు నూనె, అవసరమైన మేరకు ఉసిరి ముక్కలు వడకట్టిన నీరు కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి కనీసం రెండు గంటల వరకు ఆగి తలస్నానం చేయాలి. ఇలా చేస్తే మంచిదంటున్నారు చర్మ నిపుణులు.


ఇక ప్రస్తుత కలం యొక్క వాతవరణ పరిస్థితులు,మానసిక ఒత్తిడి వంటి వాటి వాళ్ళ కూడా ఈ సమస్య అధిక ఉండవచ్చు అని చెబుతున్నారు వైద్య నిపుణులు. వీటి నివారణకు బయట దొరికే కెమికల్స్ కాకుండా ఆయుర్వేదికంగా ట్రై చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణలు చెబుతున్నారు. అనేక రసాయనాలు కలిగిన షాంపులను ఎంత వరకు అంత తగ్గించు కుంటే కూడా ఈ సమస్యకి ఒక పరిష్కారం.


మరింత సమాచారం తెలుసుకోండి: