సాధారణంగా శరీరంలో వేడి 100 డిగ్రీల కంటే ఎక్కువగా పెరిగినప్పుడు, మనకు జ్వరం వచ్చినట్లు అనిపిస్తుంది. ఇక అంతేకాకుండా ఒళ్ళు నీరసించిపోవడం, అలసటగా అనిపించడం జరుగుతుంది. అయితే మన శరీరంలో వేడి అమాంతం పెరగాలంటే, చంకలో ఉల్లిగడ్డ పెట్టుకుంటే చాలు అంటున్నారు కొంతమంది. అంతేకాకుండా ఒకప్పుడు మహేష్ బాబు నటించిన "నిజం" సినిమా లో కూడా ఉల్లిగడ్డ తో జ్వరం తెప్పించుకునే సీన్ కూడా ఒకటి ఉంది. ఇక ఆ సీన్ లో మహేష్ బాబు చంకలో ఉల్లిగడ్డ పెట్టుకోగానే,మహేష్ బాబుకు జ్వరం వస్తుంది. అయితే నిజంగానే చంకలో ఉల్లిగడ్డ పెట్టుకోవడం వల్ల జ్వరం వస్తుందా? ఇది ఎంతవరకూ నిజం? అంతేకాకుండా దీనికి తగ్గ సైంటిఫిక్ రీజన్ ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం.
సహజంగానే ఉల్లిగడ్డలకు బ్యాక్టీరియాలను,వైరస్ లను ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకసారి కట్ చేసిన ఉల్లిపాయలను,మరొకసారి ఉపయోగించకూడదు అని అంటారు. అలా కోసిన ఉల్లిగడ్డలను చంక లో పెట్టుకోవడం వల్ల, అక్కడ ఉండే సున్నితమైన పొర ఉల్లిగడ్డ రసాన్ని పీల్చుకుంటుంది. దీంతో శరీరంలో ఉంటూ మనకు మంచి చేసే వైరస్ లు, బ్యాక్టీరియాలు శరీరానికి ఏదో ఆపద వచ్చిందని..శరీరానికి నష్టం కలిగించే వస్తువు ఏదో చంకలో ఉందని గ్రహించి, వెంటనే దానితో పోరాడడానికి అన్నీ ఒకచోటికి చేరుకుంటాయి.
ఇక అంతే కాకుండా ఉల్లిగడ్డలలో ఉండే సహజసిద్ధమైన సుఫాక్సిడ్, ఐసోలైన్ తో పాటు ఎలిసిన్ లకు వ్యతిరేకంగా అవి పనిచేస్తాయి. మన శరీరానికి మంచి చేసే వైరస్ లు,బ్యాక్టీరియాలు ఉల్లిగడ్డ లో ఉండే సహజసిద్ధమైన రసాయనాలతో పోరాడినప్పుడు, ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. తద్వారా ఉష్ణోగ్రత పెరగడం వల్ల మనకు జ్వరం వచ్చినట్టు ఫీల్ అవుతాము.
అయితే ఇలా వచ్చిన జ్వరం త్వరగానే తగ్గిపోతుంది. కానీ బీపీ, షుగర్ ఉన్నవారు ఇలాంటి పద్ధతిని ఉపయోగించడం వల్ల ఒక్కోసారి బాడీ టెంపరేచర్ బాగా పెరిగిపోయి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. కాబట్టి బీపీ షుగర్ ఉన్న రోగులు ఇలాంటి ప్రయోగాలు చేయకుండా ఉండడమే మంచిది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి