మధుమేహం ఉన్నవారికి సరిపడా కేలరీలు ఉన్న ఆహారమే ఇవ్వాలి. టీబీ ఉన్నవారు అత్యధిక కేలరీలు ఉండే ఆహారం తీసుకోవాలి.బరువు తక్కువగా ఉన్న వారు ఎక్కువ కేలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువ బరువు ఉన్న వారు తక్కువ కేలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.ప్రతిరోజు తాజాపండ్లతో పాటు డ్రైఫ్రూట్స్, పెరుగు పదార్థాలను తీసుకుంటే శరీరానికి ఫైబర్, ప్రొటీన్‌లతో పాటు మంచి కేలరీలు అందుతాయి.మొలకెత్తిన గింజలు తిన్నా శరీరానికి అదనపు శక్తి చేకూరుతుంది. శాకాహారం తినేవారిలో బీ12 లోపం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వారు ఉసిరి, క్యారెట్, ఖర్జూరం వంటి డ్రైఫ్రూట్స్‌ను తీసుకుంటే రకరకాల పోషకాలు శరీరానికి లభిస్తాయి.
మొలకెత్తిన గింజలు తినలేని వారు గోధుమ గడ్డి జ్యూస్ కూడా తీసుకోవచ్చు.మామిడి, బొప్పాయి, అరటి వంటి లేత పసుపు రంగు గల పండ్లలో విటమిన్-ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. బత్తాయి, నారింజ వంటి పండ్లను తీసుకుంటే జలుబు చేస్తుందని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదని పలువురు వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు.శరీరానికి శక్తిని అందించడంలో పండ్లకు ఉన్న ప్రత్యేకత వేరు. పండ్లలో రకరకాల పోషకాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు దండిగా లభిస్తాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి