క‌రోనా మ‌హ‌మ్మారి విళ‌య‌తాండ‌వం చేస్తుంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కేసుల సంఖ్యతో పాటు మ‌ర‌ణాల సంఖ్య కూడా పెర‌గ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. మ‌ర‌ణాల సంఖ్య పెర‌గటంతో శ‌వాల‌ను కాల్చేందుకు స్థ‌లాలు దొర‌కని ప‌రిస్థితులు కూడా క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు క‌రోనా భ‌యంతో కుటింబీకులు కూడా ద‌హ‌న‌సంస్కారాలు నిర్విహించేందుకు భ‌య‌ప‌డుతున్నారు.ఒక‌ప్పుడు ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే బంధువువు..స్నేహితులు గ్రామ ప్ర‌జ‌లు అంతా త‌ర‌లివ‌చ్చారు. కానీ ఇప్ప‌డు సొంత కుటుంబీకులే అంత్యక్రియ‌లు నిర్వ‌హించేందుకు దూరంగా ఉండ‌టంతో ద‌య‌నీయ ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఇక కుటుంబ స‌భ్యులు దూరంగా ఉండ‌టంతో అంబులెన్సు డ్రైవ‌ర్లు ద‌హ‌న సంస్కారాల‌ను నిర్వ‌హిస్తున్నారు. అంద‌కు గానూ రూ.30 వేల నుండి 40 వేల వ‌ర‌కు తీసుకుంటున్నారు. ఇది ఎక్క‌డో వేరే రాష్ట్రాల్లో జ‌రుగుతున్న‌ది కాదు. హైద‌రాబాద్, క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్ లో ప్ర‌స్తుతం ఇలాంటి పరిస్థితులు క‌నిపిస్తున్నాయి. 

ఇక సొంత‌వారి క‌డ‌సారి చూపుకు నోచుకోని కుటుంబ స‌భ్యులు వారి అంత్య‌క్రియ‌ల‌ను వీడియోకాల్స్ లో చూడంటం గుండె బ‌రువెక్కే విష‌యం.  ఎలాగూ అంత్య‌క్రియ‌ల‌ను ద‌గ్గ‌రుండి నిర్వ‌హించ‌లేక‌పోయిన వారు వీడియో కాల్స్ లో అయినా ఆక‌రి చూపు చూసుకుంటున్నారు. ఇక కుటుంబ అంత్య‌క్రియ‌ల‌కు స‌భ్యులు ముందుకు రాక‌పోవ‌డానికి అనేక కార‌ణాలున్నాయి. వాటిలో అనారోగ్య సమ‌స్య‌లు ఉండ‌టం ముఖ్య కార‌ణం. షుగర్ బీపీ వంటి దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నావారు. అంత్య‌క్రియ‌ల‌కు దూరంగా ఉండాల‌నుకుంటున్నారు. దాంతో అంబులెన్స్ డైవ‌ర్లు అంత్య‌క్రియ‌లు నిర్వహించేందుకు ముందుకు వ‌స్తున్నారు. ఇక అంబులెన్స్ సిబ్బంది సైతం డ‌బ్బుల‌కు ఆశ‌ప‌డి ఒకే ట్రాలీలో నాగుగైదు శ‌వాల‌ను తీసుకెలుతున్న హృద‌యవిదార‌క ఘ‌ట‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇక అంత్య‌క్రియ‌ల అనంత‌రం చితాభ‌స్మాన్ని మాత్రం కుటుంబ సభ్యులు వెంట‌నే తీసుకువెళుతున్నారు. ఆ త‌ర‌వాత జ‌ర‌ప‌వ‌ల‌సిన కార్య‌క్ర‌మాల‌ను స‌జావుగా జ‌రుపుతున్నారు. అయితే అంబులెన్స్ డైవ‌ర్లు అంత్య‌క్రియ‌ల‌కు డ‌బ్బులు తీసుకున్నా ఇలాంటి పరిస్థితుల్లో వారు తీసుకుంటున్న రిస్క్ కు డ‌బ్బులు ఇవ్వ‌డం త‌ప్పులేదు. కానీ ఇది పెద్ద వ్యాపారంగా మార‌కుండా ప్ర‌భుత్వం నిఘా ఉంచాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: