ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా గురించి మాట్లాడుకోవాల్సి వస్తోంది. అత్యంత వేగంగా ఆ వేరియంట్ వ్యాపించడం వల్లే ఇండియాలో కరోనా విధ్వంసం సృష్టింస్తోందని డబ్ల్యుహెచ్వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. ఈ వేరియంట్ వ్యాక్సిన్లను క బోల్తా కొట్టించవచ్చని ఆమె తెలిపారు . ఏ ఎఫ్ పీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె ఈ విషయాలను వెల్లడించారు.


B.1.617 వేరియంటే ఈ విపత్తుకు కారణమని ఆమె స్పష్టం చేశారు. దీనిని తొలిసారిగా ఇండియాలోనే అక్టోబర్ లో గుర్తించామని అని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు కరోనా వ్యాప్తిని పెంచిన వేరియంట్లు ఎన్నో ఉన్నాయని, అందులో ఇది కూడా ఒకటని ఆమె తెలిపారు. అందుకే ఈ B.1.617 వేరియంట్ ను ఒక ప్రత్యేకమైన వేరియంట్  గా డబ్ల్యుహెచ్వో కూడా ఈ మధ్య లిస్ట్ చేసింది. అయితే దీనిని ఇప్పటి వరకు ఆందోళన కలిగించే వేరియంట్ గా మాత్రం గుర్తించలేదు. ఈ సింబల్ పడిందంటే ఇది ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని, చాలా ప్రమాదకరమని , వ్యక్తిని కూడా బోల్తా కొట్టిస్తుంది అని ఆమె చెప్పుకొచ్చింది.


ఇలాంటివి ఇప్పటికే అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలు  ఆందోళన కలిగించే వేరియంట్ గా గుర్తించగా.. ఇక త్వరలోనే డబ్ల్యుహెచ్ఓ కూడా గుర్తిస్తుందని సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. ఇది సహజంగా లేదా వాక్సిన్ ల ద్వారా వచ్చే యాంటీబాడీలను కూడా బోల్తా కొట్టి స్తుందని కూడా చెప్పుకొచ్చింది. అలాంటివి ఈ B1.617 వేరియంట్లు చాలా ఉన్నాయని  సౌమ్య స్వామినాథన్ చెప్పారు. అందుకే ఈ వేరియంట్ ను చాలా ఆందోళన కలిగించే వేరియంట్ గా గుర్తించవచ్చని తెలిపారు. అయితే ఈ వేరియంట్ దే మొత్తం బాధ్యత అని కూడా చెప్పలేము. అయితే కరోనా వెళ్లిపోయిందని చాలమంది బాధ్యతా రహితంగా తిరిగారని, అందువల్లే ఈ విపత్తుకు కారణమని ఆమె అభిప్రాయపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: