ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం క‌రోనా నూత‌న వేరియంట్ ఒమిక్రాన్ ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురి చేయ‌డంతో ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోతున్నారు. ఈ త‌రుణంలోనే కేంద్ర ప్ర‌భుత్వం నుంచి త‌దుప‌రి ఆర్డ‌ర్లు లేక‌పోవ‌డంతో వ‌చ్చే వారం నుంచి కోవిషీల్డ్ టీకా ఉత్ప‌త్తిని 50 శాతం వ‌ర‌కు త‌గ్గించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అద‌ర్‌పూనావాలా  పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం పూనావాలా ఓ మీడియా సంస్థ‌తో  వెల్ల‌డించారు. భార‌త‌దేశానికి భారీ మొత్తంలో స్టాక్ అవ‌స‌రం అనుకుంటే .. అద‌న‌పు వ్యాక్సిన్ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యాన్ని కొన‌సాగించాల‌ని అనుకుంటున్న‌ట్టు త‌మ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు.

భార‌త ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ఆర్డ‌ర్లు లేని కార‌ణంగా ముఖ్యంగా కోవిషీల్డ్ ఉత్ప‌త్తిని 50 శాతం ఉత్ప‌త్తిని త‌గ్గించ‌నున్నామ‌ని, ప్ర‌భుత్వం ఒక‌వేళ కోరితే అద‌న‌పు ఉత్ప‌త్తి సామ‌ర్థ్యాన్ని కొన‌సాగిస్తాం అని పేర్కొన్నారు. వ‌చ్చే ఆరు నెల‌లో టీకాలు అందించ‌లేని ప‌రిస్థితిలో అయితే ఉండ‌బోము అని తెలిపారు. కేంద్రం సైతం 20 నుంచి 30  మిలియ‌న్ డోసుల స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌ను నిలువ ఉంచుతున్న‌దని.. ఎక్కువ రిస్క్ తీసుకోదు అని కూడా చెప్పారు. మేము లైసెన్స్ పొందిన వెంట‌నే చాలా ఎక్క‌వ రేటుతో ఉత్ప‌త్తి చేయ‌వ‌చ్చు అని వెల్ల‌డించారు.

ఒమిక్రాన్ వ్యాప్తి ఉన్న త‌రుణంలో ప్ర‌స్తుతం వ్యాక్సిన్‌ల స‌మ‌ర్థ‌త‌పై ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న టీకాలు ప‌ని చేయ‌వు అని.. న‌మ్మ‌డానికి ఎలాంటి ఆధారాలు లేవ‌ని అద‌ర్ పూనావాలా స్ప‌ష్టం చేసారు. లాన్సెట్ జ‌ర్న‌ల్ ప్ర‌కారం ఆస్ట్రాజెనెకా 80 శాతం స‌మ‌ర్థ‌త క‌లిగి ఉన్న‌ద‌ని తేలిన‌ట్టు వివ‌రించారు. ఇప్ప‌టికే ఉన్న టీకాలు ఒమిక్రాన్‌పై అంత ప్ర‌భావం చూపే అవ‌కాశం లేద‌ని మోడెర్నా సంస్థ అధ్య‌క్షుడు స్టీఫెన్ హోగ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావించారు పూనావాలా. త‌గినంత స‌మాచారం లేకుండా అంచెనాలు వేయ‌డం పై జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచ‌న‌లు చేసారు. కొవాక్స్ కార్య‌క్ర‌మం కోసం 40-50 కోట్ల డోసుల ఆర్డ‌ర్‌ల‌ను స‌మీక్షించాను అని.. ఆఫ్రిక‌న్ దేశాల ప్ర‌తినిధుల‌తో ట‌చ్‌లో ఉన్నాను అని అద‌ర్ పూనావాలా వివ‌రించారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా అవ‌స‌ర‌మైన‌దాని కంటే ఎక్కువ‌గా ఉన్న‌ద‌ని వెల్ల‌డించారు పూనావాలా.


మరింత సమాచారం తెలుసుకోండి: