ప్రస్తుతం దేశంలో కరోనా విపరీతంగా భయపెడుతోంది. కొత్త కేసులు కూడా వేగంగా పెరుగుతూ ఉండడంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది. దీంతో వారు కరోనా కు సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే హడలెత్తిపోతున్నారు.  ప్రభుత్వం సూచించినటువంటి మందులను వేసుకుంటున్నారు. అందులో పారాసెట్మాల్ టాబ్లెట్  మొదటి స్థానంలో నిలిచింది. కరోణ వ్యాధి పెరుగుతున్న సందర్భంలో మనదేశంలో పారాసెటమాల్ యొక్క వినియోగం ఎక్కువగా పెరిగింది. కొద్దిగా తల నొప్పి వచ్చినా, జ్వరం అనిపించినా పారాసెటమాల్ మందులను కాల్ పోల్, క్రోసిన్, డోలో ఇలాంటివి వేసుకుంటున్నారు.

 ఇందులో చాలా మందికి డోస్ గురించి ఎక్కువగా తెలియదు. ఎంత తీసుకోవాలో ఎప్పుడు తీసుకోవాలో తెలియకుండా ఇష్టానుసారంగా వేసుకుంటున్నారు. అయితే పారాసెట్మాల్ మందులను మైగ్రేన్, జ్వరం, తలనొప్పి, పంటి నొప్పి, మెడ నొప్పులు వచ్చినప్పుడు ఎక్కువగా వినియోగిస్తారు. అయితే  కాల్ పోల్, డోలో, క్రోసిన్, కబీమోల్, సుమో ఎల్, పాసిమాల్ లాంటి అనేక పేర్లతో మెడికల్ షాప్స్ లో లభ్యమవుతున్నాయి. కరోణ థర్డ్ వేవ్ సమయంలో ఈ యొక్క డోలో డిమాండ్ బాగా పెరిగింది. అయితే పారాసెట్మాల్ టాబ్లెట్లను  మన ఇష్టం వచ్చినట్టు వాడితే  ఆరోగ్యానికి మంచిది కాదని, దానివల్ల  సైడ్స్ ఉంటాయి. వాటిని ఎక్కువగా తీసుకుంటే హాని కలిగిస్తుంది. యూఎస్ మార్గదర్శకాల ప్రకారం చూస్తే పెద్దలకు జ్వరం వస్తే సాధారణంగా 325mg నుండి 650mg వరకు ఈ పారాసెట్మాల్ టాబ్లెట్ మోతాదు  4-6 గంటల వ్యవధిలో వాడవచ్చు. అలాగే 8 గంటల వ్యవధి ఉంటే 1000mg వరకు తీసుకోవచ్చు. ఇలా చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ వ్యక్తికి గతంలో ఏమైనా వ్యాధులు, ఎత్తు బరువును బట్టి ఈ యొక్క డోసులను నిర్ణయిస్తారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మనకు జ్వరం వచ్చిన ఆరుగంటల  తర్వాత మాత్రమే  500mg పారసిటమాల్ టాబ్లెట్ తీసుకోవాలి. చిన్నపిల్లల విషయానికి వస్తే మాత్రం పారాసిటమాల్  ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

 నెల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలకు జ్వరం వస్తే  4-6 గంటల వ్యవధిలో ఒక కిలో బరువు ఉంటే 10-15mg పారాసెటమాల్  ఇవ్వవచ్చును. అయితే ఈ పారాసెటమాల్ ను ఎక్కువగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. చర్మంపై దద్దుర్లు, అలర్జీలు, ఆకలి లేకపోవడం, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు, తిమ్మిర్లు వంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కాలేయం మరియు మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి పారాసెటమాల్ ఈ విషయంలో జాగ్రత్త వహించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: