నేటి జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఒకరోజులో మూడు సార్లు భోజనం చేయాల్సి ఉంది. అందులో కనీసం ఒక్క సారి అయినా ఇంటిలో ఫుడ్ తింటే విశేషమే అని చెప్పాలి. ముఖ్యంగా పట్టణాలలో నివసించేవారు ఎప్పుడూ బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ నే తినడానికి ఇష్టపడుతుంటారు. వాటిలో ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్, పిజాస్, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ మొదలైనవి. అయితే వీటిలో కలుపుకు తినడానికి కూరలు లేదా పప్పు ఉండవు. ఇందులో కేవలం కెచప్ లు మాత్రమే వాడుతారు. వీటిలో టమాటో, చిల్లి, స్వీట్ ఇలా కొన్ని రకాల కెచప్ లు ఉంటాయి. అయితే ఈ కెచప్ లలో టమాటో కెచప్ మన ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని డాక్టర్లు చెబుతున్నారు.

ఈ కెచప్ రుచిగా ఉండడానికి ఇందులో కొన్ని రకాల కెమికల్స్ ను యాడ్ చేస్తారు. ఇవి మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. ఈ కెచప్ లలో ఎక్కవగా చక్కర, ఉప్పు, ఫ్రక్టోజ్, ప్రెజెర్వేటివ్ లు, కార్న్ సిరప్ వంటి పదార్ధాలు ఉంటాయి. ఈ పదార్ధాల మూలంగా మన శరీరంలో అన్ని వ్యాధులు సంభవిస్తాయి. నేటి కాలంలో యువకులు సైతం అనుభవిస్తున్న ఊబకాయం సమస్య దీని వలనే వస్తుంది. ఇందులో ఉండే చక్కర మరియు ప్రెజెర్వేటివ్ లు మన శరీరంలో కొవ్వును పెంచుతుంది. ఇంకా కెచప్ లో ఉండే కార్న్ సిరప్ మరియు ఇతర రసాయనాలు మధుమేహం, గుండె సంబంధిత వ్యహాదులు, మన రోగ నిరోధక శక్తిని విచ్చిన్నం చేయడం వంటి ప్రమాదాలు జరుగుతాయి.

అంతే కాకుండా యాసిడ్ సమస్యలు కూడా వీటి వలన వస్తాయి. శరీరంపై అలర్జీలు కూడా వీటి వలన సంభవిస్తాయి. కొన్ని సార్లు ఈ అలెర్జీలు వలన వాంతులు వీరేచనాలు అయ్యే ప్రమాదం కూడా ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ మోకాళ్ళ నొప్పులు మరియు మూత్ర ఆపిండాల్లో రాళ్లు ఏప్రదం వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. కాబట్టి మీరు కెచప్ లు తింటూ ఉంటే ఈ క్షణం నుండే మానేయడం చాలా మంచిది.  


మరింత సమాచారం తెలుసుకోండి: