కలబందలో చర్మ సౌందర్యం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు కొంతమంది. కలబంద చర్మానికి కాకుండా అనేక వ్యాధులకు కూడా ఉపయోగిస్తున్నారు. కలబంద లో ఉండే విటమిన్లు -A,C, పోలిక్ యాసిడ్, మెగ్నీషియం, సెలీనియం, జింక్, ఐరన్ వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతే కాకుండా కలబంద మన నడుము చుట్టూ ఉన్న కొవ్వును కూడా తగ్గిస్తాయి. దీని ద్వారా మీ బరువు చాలా త్వరగా తగ్గేందుకు సహాయపడుతుంది. అలోవెరా జెల్ శరీరంలో విషపదార్థాలు బయటకు తీయడానికి కూడా సహాయపడుతుంది. బరువు తగ్గించుకోవాలని కలబంద ని ఉపయోగించి ఎలా బరువు తగ్గించుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1). నిమ్మరసంతో కలబంద కలిపి తీసుకోవడం వల్ల మనం బరువు తగ్గవచ్చు.. ఒక గ్లాస్ నీటిలో నిమ్మ రసాన్ని బాగా మిక్స్ చేసుకొని అందులో కాస్త కలబంద రసాన్ని కలపాలి ఈ మిశ్రమాన్ని ఉదయం పూట తాగినట్లయితే ఒక అద్భుతమైన పానీయంగా పనిచేస్తుంది.

2). కలబంద తాజా ఆకులను తీసుకొని దానిలో కాస్త గుజ్జన బయట కు తీసి.. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ గుజ్జును తిన్నట్లు అయితే.. మన శరీర బరువును తగ్గించుకోవచ్చ

3). తినడానికి ముందు కలబంద రసాన్ని తీసుకున్నట్లయితే బరువు ఈజీగా తగ్గవచ్చు. ఇందుకోసం భోజనానికి కనీసం 20 నిమిషాల ముందు ఒక చెంచా కలబంద రసాన్ని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ చాలా మెరుగుపడుతుంది.

4). కలబంద బరువు తగ్గడంలో చాలా సహాయ పడుతుంది.. దీని వల్ల శరీరంలో నిల్వ ఉండే కొవ్వు కూడా చాలా వేగంగా కరిగిపోతుంది. అలోవేరా లో విటమిన్ బి ఉండటం వల్ల ఇది కొవ్వు విచ్ఛిన్నం చేసి శక్తి  గా మారడం జరుగుతుందట. ఇలా రెండు వారాలపాటు ఉపయోగిస్తే మంచి ఫలితం దక్కుతుందట.

5). కలబంద కేవలం ఆరోగ్యానికే కాకుండా చర్మానికి, జుట్టుకు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: