ఇప్పుడున్న ఆహార అలవాట్ల వల్ల మనం తినే తిండిలో పోషకాలు లేకుండా పోతున్నాయి.కానీ మన శరీరాని పోషకాలు సరిగా అందక ఎన్నో అనారోగ్యాలు చుట్టూముడుతున్నాయి.ముఖ్యంగా బి12 విటమిన్ లోపంతో చాలామంది ఇబ్బందిపడుతున్నారు.దీనివల్ల
నాడీ వ్యవస్థ దెబ్బతిని నడకలో తేడా వస్తుందని హెచ్చరిస్తున్నారు.అంతేకాక మనిషి మెదడు, నాడీ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

బి 12 విటమిన్ మన శరీరంలో డీఎన్ఏ నిర్మాణంలోనూ, రక్తకణాలను ఊత్పత్తి చేయడంలో ఉపయోగపడుతుంది.మనిషి పరిపూర్ణానంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే విటమిన్ బి12 తప్పక అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు

బి12 లోపాన్ని తొందరగా గుర్తిస్తే, సరిదిద్దుకోవడం ఈజీనేనని , కానీ ఏమీ కాదులేనని నిర్లక్ష్యం చేస్తే నరాలకు సంబంధించిన సమస్యలు చుట్టూముడతాయని హెచ్చరిస్తారు. ఒక్కసారి నరాలకు సంబందించిన రోగాలు తలెత్తితే ఈ లోపాన్ని నయం చేయలేమని వైద్యులు పేర్కొంటున్నారు.

B12 లోపంతో నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో శరీరం మొత్తం నియంత్రణలో లేకపోవడం, మాటల్లోను,నడకలో తొందరపాటు కనిపిస్తుందని, నడక సరిగా ఉండదని, అడుగులు దూరదూరంగా పడుతుంటాయని వైద్యులు పరిశోదనలు జరిపి మరీ వివరించారు. పాదాల సచ్చుగా తయారై కదలిక మీద ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.

అంతే కానీ విటమిన్ లోపం వల్ల నాలుకపై పుండ్లు, చేతులకు వణుకు వచ్చి వస్తువులు పట్టుకోలేక పోవడం వంటి లక్షణాలు ముందుగానే కనిపిస్తాయని వెల్లడించారు. మనిషి కాళ్ళ లో నిస్సత్తువుగా ఉండి, నడిచేటప్పుడు సమన్వయము కోల్పోతాడని వైద్య నిపుణులు పేర్కొన్నారు.

ఇటువంటి సమస్యలు మన శరీరంలో కనిపిస్తే రక్త పరీక్ష చేయడం ద్వారా విటమిన్ బి12 లోపాన్ని గుర్తించి,అ లోపాన్ని సరిచేసుకోవచ్చు. ఇ విటమిన్ యొక్క లోపం తీవ్రతను బట్టి పదిరోజులకొకసారి బి12 ఇంజెక్షన్ వేసుకోవడం కానీ, లేకపోతే అధిక డోసు కలిగిన బి12 ట్యాబ్లేట్ రోజూ వేసుకుంటే సరిపోతుంది. బి12 విటమిన్ లోపం ఓ మోస్తరు స్థాయిలో ఉంటే మల్టీవిటమిన్ టాబ్లెట్లు తీసుకున్నా సరిపోతుందని వైద్య నిపుణులు సూచిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: