ఇక వేసవి సెలవులు అయిపోయి,స్కూళ్లు మొదలయ్యాయి.ఇప్పటినుంచి తల్లులు పిల్లల గురించి గాబరా పడుతూ ఉంటారు.పిల్లల్ని ఎలా చదివించాలి వారి ఏకాగ్రత ఎలా పెంచాలి అనితెగ ఆలోచిస్తూ ఉంటారు.ఇలాంటి తల్లుల కోసం కొన్ని టిప్పులు పాటించడం వల్ల వారి పిల్లలు ఏకాగ్రత పెంచవచ్చని, సైకాలజీస్టులు సూచిస్తున్నారు.ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం పదండి..

సరైన సమయం..

పిల్లల్లో ఏకాగ్రత పెంచాలి అంటే..మొదటగా సరైన సమయానికి నిద్రించడం,సరైన సమయానికి లేవడం అలవాటు చేయాలి.ఇలా చేయడం వల్ల,వారి మెదడు లో కొన్ని రకాల హార్మోన్లు రిలీజ్ అయ్యి,వారి ఏకాగ్రత శక్తిని పెంచుతాయి.మరియు ఆహార నియమాలను కూడా కచ్చితంగా పాటించాలి.

సరైన పర్యావరణం..

పిల్లలు తమ చదువుపై పూర్తిగా దృష్టి ఒకే దానిపై ఉండేందుకు,వారికి చదువుకోనే స్థలంలో ప్రశాంతమైన వాతావరణం కల్పించాలి.వారు చదువుకునే సమయంలో పూర్తి ఏకాగ్రతను పెంచేందుకు వీలుగా, శబ్దాలు రాని ప్రదేశాన్ని ఎంచుకోవడం ఉత్తమం. మరియు ఇంట్లో టీవీ,మొబైల్ నుండి పూర్తిగా శబ్దం లేకుండా ఉంచడానికి ప్రయత్నించాలి.దానితో పిల్లలకు చదువుపై దృష్టి మరల్చకుండా ఉంటుంది.

క్రమశిక్షణలో ఉంచడం..

చాలామంది పిల్లలు చదువు అనగానే,టాయిలెట్ వస్తుందనో,లేకుంటే ఆకలి వేస్తుందనో,ఏవేవో సాకులు చెబుతూ ఉంటారు.కొంత మంది తల్లిదండ్రులు వారు చెప్పే మాటలు నిజమని నమ్మి,వాళ్ళని పంపిస్తూ ఉంటారు.అది ఎంత మాత్రమూ మంచి లక్షణం కాదని సైకాలజిస్ట్ హెచ్చరిస్తూ ఉన్నారు.ఒకసారి చదువుకోవడానికి పెట్టాలి అనుకున్నప్పుడు ముందే వారి సమస్యలన్నీ తీర్చి,క్రమశిక్షణలో ఉంచాలి.

మైండ్ గేమ్స్..

పిల్లల మైండ్ చురుకుగా ఉండేలా షార్ప్ మైండ్ గేమ్‌ లు ఆడించడం ఉత్తమం.పిల్లల్లో ఎక్కువగా ఏకాగ్రత పెరుగలంటే వాక్యాలను సెట్ చేయడం మరియు పజిల్స్ వంటి ఆటలను ఆడటం అలవాటు చేయాలి.

టైం టేబుల్‌ పెట్టడం..

పిల్లలను చదువులో ఏకాగ్రత పెంచడానికి,చదవడానికంటూ ఒక టైమ్ ను సెట్ చేయాలి.వారికి టైమ్ టేబుల్‌ని సెట్ చేసి ఇవ్వడంతో వారి శరీరం ఆ నిర్ణీత సమయంలో ఎక్కువ చురుకుగా ఉంటుంది.దానితో ఆటోమెటిగ్గా వారికి ఏకాగ్రత శక్తి పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: