ఈ ఉరుకులు పరుగుల జీవితంలో రోజంతా యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా ఉండటం చాలా ముఖ్యం. మన శరీరంలో ఏమాత్రం శక్తి తగ్గిన నీరసం నిస్సత్తువ అలసత్వం ఆవహిస్తాయి. దీంతో మనం పూర్తి చేయాల్సిన పనులు ఆలస్యం అవుతాయి.. మనం అనుకున్నది సాధించాలన్న కచ్చితంగా యాక్టివ్ గా ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. మన శరీరంలో శక్తి స్థాయిలను స్థిరంగా నిర్వహించడానికి తగిన మొత్తంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రోవ్వులు, విటమిన్స్ మినరల్స్ తో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం.
కార్బోహైడ్రేట్లు శరీరానికి గ్లూకోస్ ను అందిస్తాయి. శక్తికి అవసరమైన ప్రాథమిక వనరు శక్తి జీవ క్రియకు ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి,సి వంటి పోషకాలు చాలా ముఖ్యం. మన శరీరంలో శక్తి స్థాయిలు పడిపోకుండా రోజంతా ఉత్సాహంగా, హుషారుగా పనిచేయాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..
1).అరటిపండు మనకు అన్ని సీజన్ ల్లో లభిస్తుంది. దీనిలో విటమిన్ B6 మెండుగా ఉంటుంది. ఇది ఆహారాన్ని శక్తిగా మార్చడానికి సహాయపడుతుంది. విటమిన్ B6 మీ శరీరం కార్బోహైడ్రేట్లను జీవక్రియ చేయడానికి తోడ్పడుతుంది. ఇది శక్తి ఉత్పత్తికి ఇంధనం ఇస్తుంది. అరటి పండ్లలో మెగ్నీషియం నిండుగా ఉంటుంది. ఇది శక్తి ఉత్పత్తికి తోడ్పడుతుంది.
2).క్వినోవా సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్ ఆహారం. ఇందులో మంచి డైటరీ ఫైబర్ ఉంటుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు శరీరం ద్వారా నెమ్మదిగా విచ్ఛిన్నమవుతాయి. ఇవి శక్తిని నెమ్మదిగా స్థిరంగా విడుదల చేస్తాయి.
3). పెరుగులో ఫ్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా, ప్రోబయోటిక్స్ పెరుగు వాతావరణానికి మద్దతు ఇస్తుంది.జీర్ణ క్రియలో సహాయపడుతుంది. మీ డైట్ లో పెరుగు చేర్చుకుంటే మీ ఎనర్జీ లెవెల్స్ పడిపోకుండా ఉంటాయి.
4).చియా సీడ్స్ లో కార్బ్ కంటెంట్ , ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి అద్భుతమైన శక్తిని అందిస్తాయి.
5(.స్టీల్ - కట్ వోట్స్ లో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, కరిగే, కరగని ఫైబర్ తో సహా డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ జీర్ణ క్రియను నెమ్మదిస్తుంది. ఎక్కువకాలం శక్తిని విడుదల చేస్తుంది. మీరు రోజంతా యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి