
ఆయిలింగ్ చేసుకోవడం..
కొంతమంది మహిళలు వర్క్ పరంగా రోజు ఆయిల్ పెట్టుకోవాలంటే కుదరదు.కాబట్టి రాత్రి సమయంలోనైనా వారి తలకు గోరు వెచ్చని ఆయిల్ తో మసాజ్ చేసుకొని ఉదయాన్నే షాంపూతో శుభ్రం చేసుకోవడం వల్ల,తలలో రక్తప్రసరణ బాగా జరిగి,జుట్టు దృఢంగా ఒత్తుగా పెరుగుతుంది.
జుట్టు వదులుగా పెట్టుకోవడం..
చాలామంది రాత్రి సమయంలో జుట్టు టైట్ గా ముడి వేసి పడుకుంటూ ఉంటారు దానివల్ల జుట్టుకుదుర్లు దెబ్బతిని, అనవసరంగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అలా కాకుండా జుట్టు వదులుగా పెట్టుకొని పడుకోవడం వల్ల జుట్టు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది.
పిల్లోస్ శుభ్రంగా ఉంచుకోవడం..
రాత్రి నిద్రించే సమయంలో మనం వాడే పిల్లోస్ ఖచ్చితంగా శుభ్రంగా ఉండాలి.లేకపోతే అందులో ఉన్న బాక్టీరియా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
చిక్కులేకుండా ఉంచుకోవడం..
జుట్టు వదులుగా వదులుకున్నప్పుడు ముందుగా ఏదైనా స్మూత్ బ్రష్ తో చక్కగా దువ్వి చిక్కులు లేకుండా ఉంచుకోవడం వల్ల,హెయిర్ పాలికల్స్ నేచురల్ ఆయిల్స్ ని సరైన క్రమంలో రిలీజ్ అవ్వడంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
జుట్టు చివర్లకు ఆయిల్ మసాజ్ చేయడం..
రాత్రి పడుకోబోయే ముందు జుట్టు చివర్లకు బాగా ఆయిల్ మసాజ్ చేయడం వల్ల,జుట్టు అనవసరమైన స్ప్లిట్ టెన్స్ అన్ని రాకుండా దృఢంగా ఆరోగ్యంగా ఉంటుంది.కావున మీరు కూడా పొడవాటి జుట్టు కావాలి అనుకుంటే ఈ నైట్ కేర్ రొటీన్ ని పాటించండి.