సాధారణంగా కారం ఎక్కువగా తింటే కడుపులో మంట వస్తుందని అందరికీ తెలిసిందే . అందుకే ప్రతి కూరలలో కూడా కారం యొక్క వాడకాన్ని తగ్గిస్తూ ఉంటారు. ఇక ప్రస్తుత కాలంలో చప్పగా తినడానికే చాలామంది అలవాటు పడిపోయారు. అయితే మరికొన్ని ప్రాంతాల వారు తప్పితే చాలామంది ఎక్కువగా కారం తినడానికి ఇష్టపడడం లేదు అని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే విదేశీయులతో పోల్చుకుంటే భారతీయ వంటకాలలో కారం కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ కారం వల్ల నష్టాలు తప్ప లాభాలు ఉండవని అందరూ అనుకుంటారు.

కానీ వాస్తవానికి ఎండుమిర్చి తినడం వల్ల లాభాలు ఉన్నాయని నిపుణులు సైతం సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎండుమిర్చిని తినడం వల్ల కొన్ని రకాల వ్యాధులు దూరం అవుతాయట. వీటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. బరువు తగ్గాలనుకునే వారు ఎండుమిర్చి తినడం వల్ల అధిక బరువు సమస్య తీరిపోతుంది. దీనిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. ఎండు మిర్చి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి జబ్బుల బారిన పడకుండా ఉంటారట. అలాగే చక్కర శాతం, గ్లూకోజ్ శాతం కూడా అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు..

 ఇక కారం వల్ల గుండె సమస్యలు కూడా తగ్గిపోతాయని.. దమనులలో ఉండే అధిక కొవ్వు తొలగిపోతుందని.. శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మధుమేహం వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయట. కాబట్టి కారం తినడం వల్ల ఎక్కువ కాలం బ్రతకచ్చు అన్న ఆధారాలు లేకపోయినా అనారోగ్యాలు మాత్రం దూరంగా ఉంటాయని మాత్రం చెప్తున్నారు నిపుణులు .కాబట్టి సాధ్యమైనంత వరకు ఎండుమిర్చిని మీ ఆహారంలో కాస్త ఎక్కువగానే చేర్చుకోవాలని చెబుతున్నారు. ఏది ఏమైనా కారం తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని భావించే వారు ఇకపై చింతించాల్సిన అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: