ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రజలు సైతం కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.. సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే కచ్చితంగా నెలలో ఒక్కసారైనా సరే ఈ డ్రింక్ తాగితే కిడ్నీలు సైతం క్లీన్ అవుతాయట.. అయితే కిడ్నీలో ఆరోగ్యంగా ఉండాలి అంటే తాగాల్సిన జ్యూస్ గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. కాస్త ధనియాలు జీలకర్ర రెండిటిని తీసుకొని ఒక గంట సేపు నీటిలో నానబెట్టాలి. ధనియాలు గ్యాస్ ఎసిడిటీ అజీర్ణం వంటి సమస్యలను సైతం తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయి. అంతేకాకుండా కిడ్నీలను శుభ్రం చేయడంలో కూడా దివ్య ఔషధంగా పనిచేస్తాయి.


జిలకర కూడా శరీరంలో గ్యాస్ ఎసిడిటీ వాటిని తగ్గించడమే కాకుండా మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాలను  సైతం తగ్గించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే ఇలా నానబెట్టిన తర్వాత ధనియాలు జీలకర్రతో సహా ఆ నీటిని ఏదైనా గిన్నెలో వేసి స్టవ్ మీద కొన్ని నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఇందులో ఒక నిమ్మకాయను కట్ వేసి ఆ నీటిలో మరొక మూడు నిమిషాల పాటు మరిగించాలి.. ఆ వెంటనే నీటిని వడగట్టిన తర్వాత అందులోకి కాస్త తేనెను వేసుకొని తాగితే షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది.

 ఈ జ్యూస్ ను సైతం ఉదయం పరగడుపున తాగితే ఎలాంటి సమస్యలు కూడా ఉండవట. మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా వీటిని తీసుకోవచ్చు. ఈ డ్రింక్ నెలలో కనీసం ఒక్కసారైనా తీసుకోవడం వల్ల కిడ్నీలు చాలా శుభ్రం చేస్తాయట. అలాగే ప్రేగులను కూడా శుభ్రంగా చేస్తాయి. ఈ జ్యూస్ శరీరానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.. అయితే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చిన వైద్యుల వద్దకు వెళ్లకుండా ఇలాంటి చిట్కాలను పాటిస్తే తొందరగా ఫలితం లభిస్తుంది. అయితే ఏదైనా అలర్జీ ఇతర ఇబ్బందులు ఉన్నవారు మాత్రం ఇలాంటివి పాటించకుండా వైద్యులను సంప్రదించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: