నేటి కాలంలో కంటి చూపు తగ్గడం వల్ల చిన్న వయసు నుండే చాలా మంది కళ్లద్దాలు వాడాల్సిన పరిస్థితి నెలకొంది. కంటి చూపు తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. కంప్యూటర్ లను ఇంకా సెల్ ఫోన్ లను ఎక్కువగా చూడడం వల్ల కంటి చూపు తగ్గుతుంది.ఇంకా అలాగే నిద్రలేమి కారణంగా కూడా కంటి చూపు తగ్గుతుంది.తక్కువగా నిద్రపోవడం వల్ల కంటిచూపు చాలా తీవ్రంగా దెబ్బతింటుంది. ఇంకా అలాగే పోషకాహార లోపం వల్ల కూడా  కంటిచూపు బాగా దెబ్బతింటుంది. ఇలా చాలా రకాల కారణాల వల్ల కంటి చూపు దెబ్బతింటుంది.ఇలా కంటి చూపుకు సంబంధించిన సమస్యలతో బాగా బాధపడే వారు సహజ సిద్ద ఆహారాలను తీసుకోవడం ద్వారా కూడా కంటిచూపును ఈజీగా మెరుగుపరుచుకోవచ్చు. కంటిచూపును, కంటి ఆరోగ్యాన్ని పెంచడంలో మనకు విటమిన్ ఎ ఎంతో సహాయపడుతుంది. ఇక మాంసాహారంలో విటమిన్ ఎ నేరుగా అదే రూపంలో ఉంటుంది. కానీ శాఖాహారాల్లో విటమిన్ ఎ అనేది కెరోటీన్ రూపంలో ఉంటుంది. ఇక దీనిని మన శరీరంలో ఉండే కాలేయం విటమిన్ ఎ రూపంలోకి మార్చుతుంది. విటమిన్ ఎ ఎక్కువగా ఉండే ఆహారాల్లో క్యారెట్  ఒకటి. కాబట్టి కంటి చూపుకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు రోజుకు రెండు సార్లు క్యారెట్ జ్యూస్ ను తాగాలి. అయితే క్యారెట్ జ్యూస్ ను నేరుగా తాగలేని వారు జ్యాస్ పట్టేటప్పుడు జార్ లో క్యారెట్ ముక్కలు, కీర దోస ముక్కలు, టమాట ముక్కలు ఇంకా బీట్ రూట్ వేసి మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి.


తరువాత ఈ జ్యూస్ ను వడకట్టి అందులో తేనె వేసి తీసుకోవాలి.ఇలా రోజుకు రెండు సార్లు క్యారెట్ జ్యూస్ ను తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇంకా అలాగే ఇదే జ్యూస్ లో లేత కరివేపాకును మెత్తని పేస్ట్ లాగా చేసి కలిపి తీసుకోవచ్చు. ఇలా కరివేపాకును తినడం వల్ల కూడా కంటి చూపు మెరుగుపడుతుంది. ఇంకా అలాగే ఇందులో కరివేపాకుకు బదులుగా మునగాకు పేస్ట్ ను కూడా కలిపి తీసుకోవచ్చు. కరివేపాకు ఇంకా మునగాకులో కూడా విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. ఇలా జ్యూస్ ను తయారు చేసి తీసుకోవడం వల్ల కంటిచూపు బాగా మెరుగుపడుతుంది.అలాగే కళ్లద్దాలు వాడే అవసరం కూడా తగ్గుతుంది. ఇంకా అలాగే కంటిచూపుకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు మధ్యాహ్నం భోజనంలో ఏదో ఒక ఆకుకూర ఉండేలా ఖచ్చితంగా చూసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ తాగుతూ రోజూ తగినంత నిద్ర పోవడం కూడా చాలా అవసరం. ఎందుకంటే నిద్రపోవడం వల్ల కంటిచూపుకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చని ఇంకా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: