కొంతమంది కి ఎంత తిన్నా ఒంట్లో నీరసంగా ఉంటుంది.ఎప్పుడు చూసిన డల్ గా ఉంటారు.మిగతా వారిలా అంత యాక్టీవ్ గా ఉండలేరు.దీనికి కారణం శరీరం లో రక్తహీనత.శరీరం లో రక్తశాతం ఎప్పుడైతే పడిపోతుందో అప్పటినుండి అనేక సమస్యలు తలెత్తుతాయి.బ్లడ్ తక్కువ ఉండటం వల్ల ఎముకలు దృఢత్వం కోల్పోతాయి.దీని వల్ల కాళ్ళు చేతులు లాగడం. బీపీ లెవెల్స్ పడిపోవడం జరుగుతుంది.కొంచం సేపు పని చేసుకున్న వెంటనే అలసిపోవడం.కొంచం వాకింగ్ చేసిన ఆయాస పడటం లాంటి సమస్యలు తలెత్తుతాయి.జుట్టు సమస్యలు,చర్మం పొడి బారిపోవడం జరుగుతుంది.అనేక రకాల జ్యూస్ లు తాగిన పెద్దగా ఫలితం ఉండదు.అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యూస్ వారానికి రెండు సార్లు కనుక ప్రిపేర్ చేసుకుని తాగితే,వీటి అన్నిటికి పరిష్కారం దొరికినట్టే.మరి ఆ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా.


ముందుగా నాలుగు క్యారెట్స్ ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఒక దానిమ్మ కాయని తీసుకుని వాటిలోని గింజలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు చిన్న బీట్రూట్ ముక్కలు చేసుకుని,ఇవి మూడు కలపాలి. వీటిలోనే చిన్న ఉసిరికాయ ముక్కని వేసి తగినన్ని నీళ్లు పోసి పల్చగా జ్యూస్ చేసుకొని తాగాలి.ఇలా వరానికి రెండు సార్లు చేయడం వల్ల,వంట్లో నీరసం తగ్గి ఎంతో యాక్టీవ్ గా ఉంటారు.శరీరంలో రక్తం బాగా పడుతుంది.కడుపుతో ఉన్న వాళ్లు ఈ జ్యూస్ డైలీ తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.పుట్టబోయే బిడ్డ అందంగా ఆరోగ్యంగా పుడతారు. మంచి రంగుతో బలంగా ఉంటారు.కలర్ తక్కువ ఉన్నవాళ్లు డైలీ ఈ జ్యూస్ తాగటం వల్ల మంచిగా కలర్ వస్తారు.పొట్టచ్చుట్టు ఉన్న కొవ్వు తగ్గి నాజూగ్గా తయారావుతారు.జుట్టు బాగా నల్లగా ఒత్తుగా పెరుగుతుంది.ఎముకలు బలంగా దృడంగా ఉంటాయి.బీపీ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.స్కిన్ తాజాగా మెరుస్తూ ఉంటుంది.బీట్రూట్ జ్యూస్ స్కిన్ కి రాసుకుంటే స్కిన్ నిగనిగాలాడుతుంది.ఈ జ్యూస్ తాగడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి.ఎండా కాలంలో దీని డైలీ తాగడం వల్ల వడదెబ్బ సమస్యలు దగ్గరకి రావు.మరి ఇంకెందుకు లేట్ రోజు ఈ జ్యూస్ తీసుకోవడం మర్చిపోవద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: