ఈ మధ్యకాలంలో చాలామంది ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి, ఆయిల్ కి దూరంగా ఉంటూ,రొట్టెలాంటివి తినడానికి ఎక్కువ ముగ్గు చూపుతున్నారు.అంతే కాక రొట్టెలు మన దేశపు ఆహారపు అలవాట్లలో అత్యంత ముఖ్యమైన భాగం అని చెప్పవచ్చు.సాధారణంగా మన దేశంలో గోధుమ పిండితో చేసిన రొట్టెలకు, జొన్న రెట్టెలకు ఎక్కువగా తింటాము.వీటితో పాటు మొక్కజొన్న,జొన్న, మినుములతో,రాగులు,సజ్జలు,బియ్యంతో చేసిన రొట్టెలు కూడా ఇష్టపడతారు.

ప్రజలు ఎక్కువగా టిఫిన్ సమయంలో లేదా భోజనంలో రొట్టెలను తింటూ ఉంటారు.అయితే ఒక్కోసారి రాత్రిపూట తయారు చేసిన రొట్టెలు మిగిలిపోతుంటాయి.అలాంటప్పుడు వాటిని మనుషులు తినకుండా మూగజీవాలకు తినిపిస్తుంటారు. కానీ కొన్ని రోగాలతో బాధపడేవారికి తాజా రొట్టె కంటే,చల్లటి రొట్టె ఎక్కువ ప్రయోజనకరమైనదని ఆహార నిపుణులు చెబుతున్నారు.మరి ఇంకెందుకు ఆలస్యం చల్లటి రొట్టెలను ఎవరు తినాలి,అది ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం పదండీ..

తాజా రొట్టె కంటే చల్లటి రొట్టెల్లో అధిక పోషక విలువలు ఉన్నాయని అని వైద్య నిపుణులు చెబుతున్నారు.రొట్టె చేసి 10 నుండి 12 గంటలు దాటినప్పుడు మాత్రమే అందులో RS అంటే రెసిస్టెంట్ స్టార్చ్ అధికమవుతుంది. ఈ రూపంలో ఉన్న స్టార్చ్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని సూచిస్తున్నారు.10 నుండి 12 గంటల క్రితం చేసిన రొట్టెని ఎటువంటి సందేహం లేకుండా నిర్భయంగా తీసుకోవచ్చు కూడా.

రెసిస్టెంట్ స్టార్చ్ అంటే ఇది మన శరీరంలో జీర్ణక్రియ, బరువు తగ్గడం,వ్యాధి నిరోధక శక్తిని పెంచడం వంటి ఇతర విధులకు సహాయపడే ఒక రకమైన పోషకం.ఇది ఆరోగ్యకరమైన జీవనశైలికి చాలా అవసరం.

మరీ ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు చల్లటి రొట్టెలను తినాలని సూచిస్తున్నారు.ఎందుకంటే డయాబెటిక్ రోగులకు రెసిస్టెంట్ స్టార్చ్ చాలా అవసరం. ఇది శరీరంలో ఇన్సులిన్ పెరగడాన్ని నిరోదిస్తుంది.

అంతేకాక జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా చల్లటి రొట్టెలను తినాలని చెబుతున్నారు నిపుణులు.ఎందుకంటే చల్లటి రొట్టెలు తీసుకోవడం వల్ల గ్యాస్,మలబద్ధకం,కడుపు,ఉబ్బరం వంటి సమస్యలు దరిచేరవు.ఇది కాకుండా జీర్ణక్రియను మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: