
గ్రీన్ టీ, వేడి నీరు, సోంపు నీరు, జీలకర్ర నీరు, మెంతి నీరు తీసుకోవడం ద్వారా సులువుగా బరువు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. కొవ్వును కరిగించడానికి గ్రీన్ టీ ఎంతగానో తోడ్పడుతుందని చెప్పవచ్చు. వేడి నీరు జీవక్రియను పెంచడంతో పాటు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
సోంపు గింజలను నీటిలో ఉడకబెట్టి తాగడం వల్ల ఫైబర్ లభించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. జీలకర్ర నీరు జీవక్రియను పెంచడంతో పాటు ఎక్కువ మొత్తంలో బరువు తగ్గవచ్చు. మెంతి నీరు బరువు తగ్గడానికి, అలాగే మధుమేహాన్ని నియంత్రించడానికి సహాయపడుతుందని చెప్పవచ్చు.
ఈ పానీయాలు బరువు తగ్గడానికి సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. బరువు తగ్గడానికి సమతుల్య ఆహారం, వ్యాయామం కూడా అవసరం అని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఎక్కువ బరువు ఉన్నవాళ్లు హెల్త్ విషయంలో మరింత కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం బరువు సులువుగా తగ్గే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
కొన్ని పానీయాలు తాగడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దీర్ఘకాలంలో బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయి. గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు తాగడం ద్వారా కూడా బరువు తగ్గవచ్చు. దాల్చిన చెక్క నీళ్లు తాగడం ద్వారా కూడా బరువు తగ్గవచ్చు. పడుకునే ముందు మెంతి నీరు తీసుకుంటే కూడా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఛమోలీలే టీ , పసుపు పాలు, సెలరీ, కలబంద, అల్లం - నిమ్మతో చేసిన టీ , తాగడం ద్వారా కూడా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గడం కోసం నిత్య జీవితంలో ఎంతోమంది కష్టపడుతూ ఉంటారు. అయితే సరైన ప్రణాళికతో ముందుకెళ్తే బరువు తగ్గడం కష్టమేం కాదు.