
చాలామందికి ఒక అలవాటు ఉంది – అవసరం ఉన్నా లేకపోయినా కనిపించిన ప్రతి వస్తువును ఫ్రిజ్‌లో పెట్టేస్తారు. ఇలా ఎక్కువగా ఫ్రిజ్ వాడటం చాలా మందిలో కామన్‌గా మారింది. కానీ ఫ్రిజ్ వాడకం ఎంత తక్కువగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని పదార్థాలను, కూరగాయలను, పండ్లను అస్సలు ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అలా పెడితే ఉపయోగం కాకుండా అనారోగ్యం వచ్చే ప్రమాదం ఎక్కువ. ఈ విషయాన్ని డాక్టర్లు మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నారు. మరి ఫ్రిజ్‌లో అసలు పెట్టకూడని వస్తువులు ఏమిటో చూద్దాం.
1. బంగాళాదుంప (ఆలుగడ్డ):
చాలామంది ఆలుగడ్డను ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తారు. ఫ్రెష్‌గా ఉంటుందని, పాడవదని అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా తప్పు. ఆలుగడ్డను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అందులోని పిండి పదార్థం వేగంగా చక్కెరగా మారుతుంది. ఇది డయాబెటిస్ రోగులకు మాత్రమే కాకుండా సాధారణ వ్యక్తులకు కూడా హానికరం. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఫ్రిజ్‌లో పెట్టిన బంగాళాదుంప అస్సలు వాడకూడదు.
2. అరటిపండు:
ప్రతి ఇంట్లో ఉండే కామన్ పండు అరటి. తాజాగా ఉండాలని చాలామంది ఫ్రిజ్‌లో పెడుతారు. కానీ అది తప్పు. ఫ్రిజ్‌లో పెడితే తొందరగా నల్లబడుతుంది, రుచి కూడా పోతుంది. కొన్నిసార్లు ఇలాంటి అరటిపండ్లు తింటే విరేచనాలు వచ్చే అవకాశముంది అని డాక్టర్లు చెబుతున్నారు.
3. పుచ్చకాయ:
చాలామంది పుచ్చకాయను చల్లగా ఉండటానికి, జ్యూస్ చేసుకోవడానికి ఫ్రిజ్‌లో పెడుతారు. కానీ ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయను తినడం ఆరోగ్యానికి మంచిది కాదు అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
4. ఉల్లిపాయ:
కొంతమంది ఉల్లిపాయలను కూడా ఫ్రిజ్‌లో పెడుతారు. ఫ్రెష్‌గా ఉంటుందని అనుకుంటారు. కానీ ఉల్లిపాయలను గది ఉష్ణోగ్రతలోనే నిల్వ చేయాలి. ఫ్రిజ్‌లో పెట్టడం ప్రమాదకరం. ముఖ్యంగా సగం కట్ చేసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు వాడటం చాలా తప్పు.
5. టమోటా:
టమోటా దాదాపు ప్రతి ఇంటి ఫ్రిజ్‌లో కనిపిస్తుంది. కానీ టమోటాలను ఫ్రిజ్‌లో పెట్టితే వాటి రుచి, తేమ పోతాయి. రూమ్ టెంపరేచర్‌లో ఉన్నప్పుడే టమోటా అసలు రుచి ఆస్వాదించగలరు.
6. తేనె:
తేనె ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని చాలామంది ఫ్రిజ్‌లో పెడతారు. కానీ ఇది తప్పు. ఫ్రిజ్‌లో పెట్టిన తేనె గట్టిపడిపోతుంది, రుచి పోతుంది. అలాంటి తేనె వాడకం ఉపయోగం ఉండదు.
7. బ్రెడ్:
చాలామంది బ్రెడ్‌ను ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని ఫ్రిజ్‌లో పెడుతారు. ఎక్స్‌పైరీ డేట్ చూసుకోకుండా నెలల తరబడి తింటారు కూడా. ఇది చాలా ప్రమాదకరం. వాంతులు, విరేచనాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్రెడ్‌ను ప్యాకెట్‌లో గాలి వెళ్లకుండా మూసి, ఎక్స్‌పైరీ డేట్‌లోపే తినేయాలి అని డాక్టర్లు చెబుతున్నారు.