టెక్నాల‌జీ రంగానికే త‌ల‌మానికం అయిన ఐటీ రంగంలో హెచ్‌ఐవీ బగ్ చాప‌కింద నీరులా పాకుతున్న‌ట్టు తెలుస్తోంది. గ‌ణాంకాలు కూడా ఈ నిజాలు చెపుతున్నాయి. అన్ని రంగాల్లోను సంగ‌తి ప‌క్క‌న పెడితే దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల ల‌లో ఐటీ రంగంలో హెచ్ఐవీ రేటు పెరుగుతున్న‌ట్టు లెక్క‌లు భ‌యంక‌ర నిజాల‌ను వెల్ల‌డి చేస్తున్నాయి. ఈ విష‌యాన్ని ‘ జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ( న్యాకో ) ’ తాజాగా వార్నింగ్ కూడా ఇచ్చింది. ఐటీ రంగం లో హెచ్‌ఐవీ పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించింది. మొత్తంగా హెచ్‌ఐవీ వ్యాప్తి తగ్గినా.. ఐటీ రంగంతో పాటు వ్యవసాయ కూలీల్లో కూడా ఈ రేటు లో పెరుగుద‌ల స్వ‌ల్పంగా ఉండ‌డం ఆందోళ‌న గా మారింది.


ఇక తెలంగాణలో గత ఏడాదితో పోల్చితే ఈసారి హెచ్‌ఐవీ సంక్రమణ రేటు 0.44 నుంచి 0.41కు తగ్గిందని తెలంగాణ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ వివ‌రాలు వెల్ల‌డించింది.  2030 నాటికి ఎయిడ్స్‌ను ప్రజారోగ్య ముప్పు జాబితా నుంచి తొలగించే దిశగా చర్యలు చేపట్టినట్టు కూడా స్ప‌ష్టం చేసింది. ఇక ఐటీ రంగంలో గ‌త కొంత కాలంగా హెచ్ఐవీ రేటు పెర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం వీరి అత్యాధునిక , విదేశీ త‌ర‌హా ఆధునిక జీవ‌న‌శైలీకి అల‌వాటు ప‌డ‌డం కూడా కార‌ణం అంటున్నారు. వీరు వీకెండ్స్ పార్టీల‌లో విచ్చ‌ల విడి శృంగారానికి అల‌వాటు ప‌డ‌డం , ఎక్కువ మందితో శారీర‌క సంబంధాలు .. డ్ర‌గ్స్ , మ‌ద్యం మ‌త్తులో అర‌క్షిత శృంగారం చేయ‌డం కూడా కార‌ణం అని తెలుస్తోంది.


గ‌తంలో గర్భం రాకుండా ఉండేందుకు చాలా మంది కండోమ్‌లు వాడేవారని.. కానీ ఇప్పుడు శృంగారం తర్వాత కూడా ఐపిల్‌ తరహా తక్షణ గర్భనిరోధక మాత్రలు వేసుకుంటున్నారు. దీంతో అర‌క్షిత శృంగారం పెరిగిందంటున్నారు. ఇక వ్య‌వ‌సాయ కూలీల‌లో హెచ్ఐవీ పై పెద్ద‌గా అవ‌గాహ‌న లేక‌పోవ‌డం, త‌ర‌చూ వివిధ ప్రాంతాల‌కు వ‌ల‌స వెళ్ల‌డం కూడా వీరిలో ఈ రేటు పెర‌గ‌డానికి కార‌ణంగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: