ముఖ్య సంఘటనలు..
1860 : మొదటిసారి మానవుని కంఠధ్వని రికార్డు చేయబడింది. (ఫొనాటోగ్రాఫ్ యంత్రం ద్వారా)
2011 :అన్నా హజారేకు అవినీతి పై వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు గానూ ఐ.ఐ.పి.ఎం రవీంధ్రనాథ్ ఠాగూర్ అంతర రాష్ట్రీయ శాంతి పురస్కారంగా ఒక కోటి రూపాయలు యిచ్చుటకు ప్రకటించారు.
ప్రముఖుల జననాలు
1770: థామస్ సీబెక్, జర్మన్ భౌతిక శాస్త్రవేత్త. (మ. 1831)
1893: రాహుల్ సాంకృత్యాయన్, రచయిత, చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు (మ. 1963).ఆయన బహుభాషావేత్త, బహుముఖప్రజ్ఞాశాలి, వైవిధ్యభరితమైన జీవితాన్ని జీవించారు. రాహుల్ సాంకృత్యాయన్ లోకసంచారిగా పేరుపొందారు. తన జీవితంలో 45 సంవత్సరాల పాటు యాత్రలలోనే గడిపారు. లోతైన తాత్త్విక చింతన కలిగిన సాంకృత్యాయన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి బౌద్ధ భిక్షువుగా మారి అనంతరం మార్క్సిస్ట్ సోషలిస్టుగా పరివర్తన చెందారు
1930: మన్నవ బాలయ్య, 350 పైగా చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించాడు.
1948: జయ బచ్చన్, హింది నటి,, అమితాబ్ బచ్చన్ భార్య.
1974: జెన్నా జేమ్సన్, ప్రపంచ పేరొందిన శృంగార తార.
ప్రముఖుల మరణాలు..
1989: ఏ.ఎం.రాజా, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు. (జ. 1929)
1994: చండ్ర రాజేశ్వరరావు, కమ్యూనిస్టు నాయకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు సామ్యవాది, తెలంగాణా సాయుధ పోరాటంలో నాయకుడు. (జ. 1915)
2014: ఆలె నరేంద్ర, రాజకీయనాయకుడు. (జ. 1946). భారత కేంద్ర ప్రభుత్వములో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించిన ప్రారంభంలో ఆ పార్టీ అగ్రనాయకులలో ఒకరు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ క్రియాశీలక కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నరేంద్ర, అనుచరవర్గములో టైగర్‌గా ప్రసిద్ధులు. 2003 వరకు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగములో చెప్పుకోదగిన పాత్ర పోషించిన నరేంద్ర 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ నుండి బయటికి వచ్చి ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై ఒక రాజకీయ వేదికను ప్రారంభించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పతాకస్థాయిలో ఉన్న దశలో తను స్థాపించన వేదికను కె.చంద్రశేఖరరావు ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేశారు.
2015: నర్రా రాఘవ రెడ్డి, కమ్యూనిస్టు యోధుడు, ఆరుసార్లు చట్టసభకు ఎన్నికైన ప్రజాప్రతినిధి. (జ.1924)
2020: కావేటి సమ్మయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. (జ.1952)
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి