నేటి సమాజంలో పెద్దవాళ్ళ కంటే చిన్న పిల్లలే ఎక్కువగా ఊబకాయం బారిన పడుతున్నారు. ఇక మారుతున్న జీవన శైలిలో జంక్ ఫుట్స్ తీసుకోవడం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం, ఈ  సమస్యకు ముఖ్యకారణాలు గా చెప్పవచ్చు. ఈ సమస్యను  ఎలా అధిగమించడం అన్న అంశం పై ఓ నిపుణు ల బృందం పరిశోధన చేశారు.

అయితే ప్రొబయోటిక్ ఆహార పదార్థాల వల్ల కలిగే లాభాల గురించి అందరికి తెలిసిందే. వాటిలో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టిరీయాలు మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రధమంగా జీర్ణ క్రియను మెరుగుపరిచి మంచి ఆరోగ్యాన్ని అందించడానికి సహాయపడతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి అలర్జీలు రాకుండా రక్షణ కలిగిస్తుంది. అయితే ఈ పొషకాలు మనకు పచ్చడి, బటర్ మిల్క్, పెరుగు,.. వంటి పులియబెట్టిన ఆహార పదార్థాలలో ఎక్కువగా లభిస్తుంది. ఇక తాజాగా ఓ అధ్యయనంలో ప్రొబయోటిక్స్ వల్ల మరింత మేలు చేకూర్చే ప్రయోజనాలు ఉన్నట్టు రుజువైంది.

ఇక బాల్యం, కౌమార దశలో ఊబకాయంతో బాధపడుతున్నవారి బరువు తగ్గించడంలో ప్రొబయోటిక్స్ శక్తివంతంగా పనిచేస్తాయని తేలింది. ఈ అధ్యయనం ఫలితాలను యూరోపియన్ సొసైటీ ఆఫ్ ఎండోక్రినాలజీ-2020లో విడుదల చేశారు. 6 నుంచి 18 సంత్సరాల మధ్య వయసు ఉండి ఊబకాయంతో బాధపడుతున్న100 మంది పై దాదాపు 8 వారాల పాటు ఈ  పరిశోధనల అధ్యయనం నిర్వహించారు. క్యాలరీస్ లేని  ఆహారం ఇవ్వడంతోపాటుగా ప్రొబయోటిక్స్ అందజేశారు. ఇలా చేయడం వలన జీవక్రియ శక్తివంతం గా మారి, బాల్యం, కౌమర దశలో ఉన్నపిల్లలు బరువు తగ్గారు.

అంతేకాకుండా పిల్లలో డయాబెటిస్, గుండె పోటు వంటి ఇతర ఆరోగ్య సమస్య ల తీవ్రత ను కూడా ప్రొబయోటిక్స్ తగ్గిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన పైమోంటే ఓరియంటల్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఫ్లావియా ప్రొడామ్ మాట్లాడుతూ జీవక్రియ లో ప్రొబయోటిక్స్ పాత్రను మరింతగా అధ్యాయనం చేస్తామని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: