నాటి తరం యువతకు నేటి తరం యువతకు ఎన్నో తేడాలు ఉన్నాయి. నాటి తరం యువత ప్రేమ పేరెత్తితే ఆమడదూరం పోయేవాళ్ళు... ఆమ్మో ప్రేమించడమా  అని భయపడే వాళ్ళు... కానీ నేటి తరంలో మాత్రం లవ్ ఇస్ లైఫ్... లైఫ్ ఇస్ లవ్ అన్నట్లుగా మారిపోయింది. చిన్న పోరగాల్లా  నుంచి పెళ్లయిన వాళ్ళు కూడా  గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నారు. ఒకప్పుడు మంచి ఉద్యోగం.. మంచి ఇల్లు.. మంచి కుటుంబం ఉంటే గ్రేట్ అని ఫీలయ్యేవారు... కానీ ఇప్పుడు మాత్రం మంచి గర్ల్ ఫ్రెండ్ ఉందంటే చాలు ప్రపంచంలో వాళ్ళ కంటే గ్రేట్ ఎవరు కాదు అన్నట్లుగా ఫీలవుతున్నారు ఈ తరం యువత. ఇక గర్ల్ ఫ్రెండ్ లేదు అంటే వాడిని  ఏదో చీడపురుగు చూసినట్లుగా చూస్తుంటారు. అరే నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు రా అని ఎవరికి చెప్పినా ఈ రోజుల్లో నమ్మే పరిస్థితులు మాత్రం లేవు. 

 

 

 

 నేటితరం యువత కి జీవితానికి సంబంధించిన లక్ష్యాలు  ఏమీ లేవు... ఉన్నదల్లా ఒకటే లక్ష్యం ఏదో ఒకటి చేసి అమ్మాయిలను పడేయడం గర్ల్ ఫ్రెండ్ ను  మెయింటెన్ చేయడం సినిమాలు షికార్లకు తిరగటం . ప్రస్తుతం ఉద్యోగం లేకపోయినా లైఫ్ వేస్ట్ కాదు అనుకుంటున్నారు  కానీ గర్ల్ ఫ్రెండ్ లేని లైఫ్ మాత్రం వేస్తే అనుకుంటున్నారు నేటితరం యువత. వాళ్ళకి వాళ్ళు  చాలా గొప్ప అని ఫీల్ అవ్వాలి అంటే ఓ అందమైన గల్  ఫ్రెండ్ ఉండి తీరాల్సిందే నేటి రోజుల్లో. కులాలకు మతాలకు అతీతంగా యువత ప్రాధాన్యత ఇస్తున్నది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కే . ఇక ఒక అమ్మాయి నచ్చిందంటే ఆ అమ్మాయి ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. 

 

 

 కాలేజీ ఫీజులు అని ఇంట్లో చెప్పి వేలకు వేలు తీసుకుని అమ్మాయిలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నాటి యువత. ఇంతలా చెబుతున్నా అంటే అదేదో  నిజమైన ప్రేమ అనుకునేరు... అదంతా మూడు నాలుగు రోజుల ముచ్చటే.. కొన్ని రోజుల వరకు కలిసి తిరగడం ఆ తర్వాత బోర్ కొట్టకా  బ్రేకప్ చెప్పి వేరే అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ గా  చేసుకోవడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. అమ్మాయిలను ఆకర్షించేందుకు కొత్త కొత్త బైక్ లు కొత్త కొత్త బట్టలు అబ్బో.. అవన్నీ అదో రకంగా ఉంటాయి. నేటితరం యువత గర్ల్ ఫ్రెండ్ కి ఇచ్చి అంత ఇంపార్టెన్స్ కనీసం పేరెంట్స్ కి ఇవ్వడం లేదు తమ కెరీర్ కి కూడా ఇవ్వడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: