సంక్రాంతి అంటే గుర్తొచ్చే అంశాల్లో గాలిపటాలు ఒకటి. గంగిరెద్దులు, పిండివంటలు,భోగిమంటలు, కొత్త అళ్లుళ్లు, కోడిపందేలతో పాటు గాలి పటలా సందడి కూడా తక్కువేమీ కాదు. ప్రత్యేకించి అబ్బాయిలు సంక్రాంతి వస్తే పతంగులతో రెడీ అవుతారు. పండుగ సెలవుల్లో అదే వారి ప్రధాన వ్యాపకం అవుతుంది.

 

అయితే ఈ సంక్రాంతి పతంగుల వెనుక కూడా చాలా సీక్రెట్ ఉందండోయ్.. అసలు పతంగులు ఎందుకు ఎగరేస్తారు.. ఈ వేడుక ఎలా మొదలైందో తెలుసా.. సంక్రాంతి సమయంలో.. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. ఆరునెలల ఉత్తరాయణం కూడా మొదలవుతుంది.

 

 

దక్షిణాయణం దేవతలకు రాత్రిగా.. ఉత్తరాయణాన్ని పగలుగా చెబుతారు. అంటే వెలుగులు తెచ్చే కాలం అనే కదా. ఈ సమయంలో వాతావరణంలో మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. చల్లని చలికాలంలో వెచ్చవెచ్చని సూర్య కిరణాలు మన శరీరానికి తగలడం చాలా అవసరం.

 

అందుకే మకర సంక్రమణం జరిగే సమయంలో.. పొద్దున్నే వెచ్చ వెచ్చగా సూర్యకిరణాలు శరీరానికి తాకాలనే ఈ గాలిపటాల వేడుక ప్రారంభించారట. అలా మొదలైన వేడుక క్రమక్రమంగా కొత్త హంగులు సంతరించుకుంది. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం చాలా అవసరం సుమా.

మరింత సమాచారం తెలుసుకోండి: