జీవితంలో విజయం సాధించాలంటే ఏం కావాలి.. చాలా చిక్కుప్రశ్న ఇది.. అలాగే ఎంతో సులభమైన ప్రశ్న కూడా. కష్టపడేతత్వం.. అనుకున్నది సాధించే మనస్తత్వం.. పట్టుదల ఇవే జీవితంలో విజయం సాధింపజేస్తాయని భావిస్తారు. అయితే వీటి కంటే మరో లక్షణం మనల్ని విజయం వైపు సులభంగా నడిపిస్తుంది. ఆ లక్షణం మనల్ని కెరీర్‌లోనే కాదు.. నిజ జీవితంలోనూ ఆనందంగా ఉంచుతుంది.

 

 

అదే సహనం. అవును.. సహనంతో చాలా విజయాలు సాధ్యమవుతాయి. అసలు అది విజయమా.. అపజయమా అన్న సంగతి పక్కకు పెడదాం.. నిజజీవితంలో ఎదుటి వారిని అర్థం చేసుకునేందుకు.. ఇది చాలా ఉపయోగపడుతుంది. కేవలం కేరీర్‌లోనే కాదు.. జీవితంలో ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవాలన్నా, భౌతికపరమైనవి దక్కించుకోవాలన్నా మనిషికి ఈ సహనం తప్పనిసరి.

 

 

మరి ఈ సహనం అంటే ఏమిటి? నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకుంటూ, నిరంతరం అంకితభావంతో చేసే కృషే. అవాంతరాలెదురైన సందర్భాల్లో సైతం, పక్కకు తప్పుకోకుండా ఆత్మస్థైర్యంతో పట్టుదలతో ఎదుర్కోవడానికి ఈ సహనం తోడ్పడుతుంది.

 

 

సహనం అంటే.. పొగడ్తలకు, విమర్శలకు ప్రాధాన్యమివ్వకుండా సాగిపోయే ఓ నిరంతర యజ్ఞం. కార్యక్షేత్రం ఏదైనా కోరుకున్న ఫలితాలను సాధించాలంటే, శిఖరాలను అధిరోహించాలంటే ఈ సహనం అనే సుగుణం తప్పనిసరి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రపంచం మనుగడే సహనంతో ముడిపడి ఉంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: