జీవితమంటే పోరాటం.. అవును ఈ మాట అక్షరాల నిజమే.. మనిషి పుట్టక నుంచి చావు వరకూ మధ్యలో జరిగేదంతా పోరాటమే.. జీవన పోరాటమే.. ఈ భూమిపై పడుతూనే శ్వాస కోసం పోరాటం ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి ప్రతి ఘట్టంలోనూ పోరాటం తప్పదు. అయితే ఈ పోరాటంలో కొందరు మాత్రమే విజయం సాధిస్తారు.
![]()
మరికొందరు జీవితంలో పోరాడి గెలవలేని బలహీనులు రాజీ పడతారు. గెలుస్తామనే నమ్మకం ఉన్న బలవంతులు యుద్ధం చేస్తారు. బ్రతకడం కోసం రాజీపడడం కంటే నీకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం . ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు పోరాడు అప్పుడు ఓటమి నీ కాళ్ళ కింద గెలుపు నీ కాళ్ళ ముందొచ్చి వాలుతుంది.

ఈ విషయం గుర్తు పెట్టుకోండి.. మీ జీవితాన్ని మీవ్వే రాసుకోడానికి మార్చుకోడానికి ప్రయత్నించాలి.. అంతేగాని పదిమంది మనం చేసే ప్రతీ పనిని ప్రశంసించాలని ఆరాటపడటం వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది . బతుకు పోరాటంలో ప్రతిసారీ గెలవాలని ఆశపడటం కూడా అత్యాశే అవుతుంది.
పరాజయాన్ని తట్టుకుని నిలబడటం విజయానికి తొలి మెట్టు అవుతుంది. గెలవాలంటే ముందు ఓటమిని అంగీకరించగలగాలి.. ఆ ఓటమి నుంచి పాఠం నేర్చుకోగలగాలి.. పరాజయాన్ని విశ్లేషించుకుని గెలుపు వ్యూహం రచించుకోగలగాలి.. అప్పుడే మీకు విజయం ఓ అలవాటుగా మారుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి