ప్రస్తుతం కాలంలో ఏవి తిన్నా ,తాగినా కూడా రుచి ఉంటుంది కానీ ఆరోగ్యం లేదు.. అందుకే మన వాళ్ళు ఇంట్లో దొరికే వాటిని పక్కన పెట్టి డాక్టర్ల దగ్గరకు పరిగెడుతూ ఉంటారు.. అయిన కూడా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో మళ్లీ పాతకాలం వంటలు అంటూ వాటిని తింటారు. అవి ఎలా చేసుకోవాలో చేతకాక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం ఈ డ్రింక్ చేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. రుచిగా ఉండటమే కాదు.. మంచి శక్తిని కూడా ఇస్తుందని నిపుణులు అంటున్నారు.



ఇది ఒక మిల్క్ షేక్.. వీటిలో అన్నీ రిచ్ గా ఉండే పదార్థాలను వాడుతారు. అందుకే త్వరగా శక్తి లభిస్తుంది. ఈ డ్రింక్ లో వేరే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ను అంటే బాదాం అలాగే వేరుశనగలను యాడ్ చేస్తాం. కాబట్టి ఇది బోలెడంత ఎనర్జీ ఇస్తుంది. మిమల్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ముఖ్యంగా ఉపవాస సమయాల్లో ఈ డ్రింక్ చాలా అంటే చాలా అవసరం. ఈ డ్రింక్ ను పిల్లలు నుంచి పెద్దలు వరకు అందరూ ఇష్ట పడుతుంటారు. మరి ఈ డ్రింక్ ను ఎలా తయారు చేస్తారు అనేది చూద్దాం..


కావలసిన పదార్థాలు..

 
మఖానా : కప్పు

 పీనట్స్. : 2 టేబుల్ స్పూన్స్

 ఆల్మండ్స్ : 2 టేబుల్ స్పూన్

 తేనె.   :2 టేబుల్ స్పూన్

 పాలు : పాలు

 ఎండు ద్రాక్షలు : గార్నిషింగ్ కోసం

 మిక్స్డ్ సీడ్స్ : ఒక టీస్పూన్


తయారీ విధానం..


ముందుగా పాన్ పెట్టుకొని మాఖనాను రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి..వాటిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో పీ నట్స్ , ఆల్మండ్స్ వేసుకొని బాగా రోస్ట్ చేయాలి. మఖానా, పీనట్స్ అలాగే ఆల్మండ్స్ అనేవి రూమ్ టెంపరేచర్ లోకి మారగానే వాటిని మిక్స్డ్ గ్రైండర్ లోకి మార్చండి. పాలను కలపండి. బాగా గ్రైండ్ చేయండి. ఆ తర్వాత అందులోనే పాలను కలిపి బాగా మిక్స్ చేయండి.. ఒక గ్లాసులోకి ఈ డ్రింక్ ను తీసుకొని ఎండు ద్రాక్ష, నట్స్ వేసి గార్నిష్ చేసుకుంటే సరి ఎంతో రుచికరమైన షేక్ రెడీ.. దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది..త్వరగా శక్తిని ఇస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: