సాధారణంగా పెళ్లిళ్లు జరిగేటప్పుడు ఆపండి అంటూ పోలీసులు గాని, హీరోలు కానీ వచ్చి పెళ్లి ని ఆపడం మనం సినిమాల్లో చూస్తుంటాం. ఇలాంటి సీన్లు సినిమాలలో తప్ప రియల్ లైఫ్ లో జరగలేదు. కానీ ఉత్తరాఖండ్లో ఇలాంటి సీన్ ఒకటి జరిగింది. పెళ్లి కూతురు పిలిచిందని కళ్యాణ మండపం పై లో పోలీసులు ప్రత్యక్షమయ్యాడు. అసలు ఏం జరిగింది. పోలీసులు ఎందుకు వచ్చారు అన్న విషయం గురించి తెలుసుకుందాం.


 అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది కానీ ఇంతలో అక్కడికి కొందరు పోలీసులు వచ్చారు. బంధువులు అందరూ టెన్షన్ లో ఉన్నారు. శుభమా అని పెళ్లి జరుగుతుంటే పోలీసులు ఎందుకు వచ్చారా అని భయపడుతున్నారు. కానీ తీరా చూస్తే ఆ పోలీసులను పెళ్లికూతురు పిలిచింది. తన పెళ్లి లో భాగంగా జరుగుతున్న ఓ కార్యక్రమం ఆమెకు ఇష్టం లేదట. అందుకే పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు వచ్చి ఆ పెళ్ళిలో తనకి ఇష్టంలేని కార్యక్రమాన్ని రద్దు చేయించారు.


 ఏంటి ఇలా కూడా పెళ్లిళ్లు జరుగుతున్నాయా అని ఆశ్చర్యపోవాలి. అసలు పెళ్లి కూతురు ఇష్టమైన ఆ కార్యక్రమం ఎవరో తెలుసా, ఉత్తరాఖండ్ లో ఓ కొత్త స్కీమ్ లో పోలీసులే ప్రారంభించారు. వాస్తవానికి ప్రభుత్వం ఇలాంటి స్కీమ్లను ప్రవేశపెడుతున్నాయి. కానీ ఉత్తరాఖండ్ లో పోలీసులు ముందుకు వచ్చి ఆ కొత్త స్కీమ్ ను ప్రారంభించారు. అమ్మాయిలు అందరికీ ఆ స్కీమ్ గురించి తెలియజేస్తున్నారు. మద్యం నిషేధం లో భాగంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తెహ్రి జిల్లాలోని దేవప్రయాగ పోలీస్ స్టేషన్లో కొత్త ప్రయోగానికి పోలీసులు శ్రీకారం చుట్టారు. పెళ్లి వేడుకల్లో దూందాం అనిపించేలా డీజే లు బాజాభజంత్రీలతో పాటు ఫుల్లుగా మద్యం పార్టీలు కూడా జరుగుతున్నాయని తెలిసిందే.


 అయితే తమ పెళ్లిలో మద్యం ఏరులై పారే కూడదని అందరు అమ్మాయిలు అనుకుంటారు. కానీ మద్యం పార్టీ జరుగుతోంది ఏం చేయలేక ఉండిపోతారు. అలాంటి అమ్మాయిలు ముందుకొచ్చి తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. అలా ఫిర్యాదు చేస్తే తాము అక్కడికి వచ్చి మద్యం పార్టీలు చేస్తామని దేవ్ ప్రయాగ్ పోలీసులు చెబుతున్నారు. అంతేకాదండోయ్ అలా ఫిర్యాదు చేసి పెళ్లి లో మద్యం నిషేధానికి పూనుకున్న వధువులకు 10,001 రూపాయల నగదు బహుమతి కూడా ఇస్తారట. దీనికి సోదరి కన్యాదాన్ స్కీమ్ అని పేరు కూడా పెట్టారు. ఈ విషయం తెలిసి కుర్రాళ్ళు అందరూ శాక్ అవుతుంటే యువతులు మాత్రం ఎగిరి గంతేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: